September 12, 2026
Praja Telangana
తెలంగాణ

*సమాజ సేవకు బలంగా రెడ్ క్రాస్ సభ్యత్వ విస్తరణ__ మంచిర్యాలలో శాశ్వత సభ్యత్వ నమోదు కార్యక్రమం*

మంచిర్యాల,జూన్3:మానవత సేవల విస్తరణకు ప్రజల భాగస్వామ్యం మరింత పెరగాల్సిన అవసరం ఉందని భారతీయ రెడ్ క్రాస్ సొసైటీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు వి.మధుసూదన్ రెడ్డి పేర్కొన్నారు.భారతీయ రెడ్ క్రాస్ సొసైటీ రాష్ట్ర శాఖ ఆదేశాల మేరకు నిర్వహిస్తున్న శాశ్వత సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ధరణి మధుకర్,కార్పొరేషన్ సిబ్బంది మద్ది కృష్ణ అరుణ,మద్ది కృష్ణ పున్నం కుమార్ రెడ్ క్రాస్ శాశ్వత సభ్యత్వం స్వీకరించారు.మేయర్ ఛాంబర్‌లో నిర్వహించిన కార్యక్రమంలో సభ్యత్వ ధ్రువపత్రాలను వారికి అందజేయడం జరిగింది.ఈ సందర్భంగా వి.మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ,ప్రకృతి విపత్తులు,రోడ్డు ప్రమాదాలు,అత్యవసర వైద్య పరిస్థితులు,రక్త అవసరాలు తలెత్తిన సమయంలో రెడ్ క్రాస్ సంస్థ నిస్వార్థ సేవలతో సమాజానికి అండగా నిలుస్తోందన్నారు.సేవాభావం కలిగిన ప్రజాప్రతినిధులు,అధికారులు,ఉద్యోగులు,స్వచ్ఛంద సేవకులు సంస్థలో భాగస్వాములు కావడం ద్వారా సేవా కార్యక్రమాలకు మరింత బలం చేకూరుతుందని తెలిపారు.రక్తదాన శిబిరాల నిర్వహణ,ఆరోగ్య అవగాహన కార్యక్రమాలు,విపత్తు సహాయక చర్యలు,నిరుపేదలకు వైద్య సహకారం,యువతలో మానవతా విలువల పెంపు వంటి అనేక రంగాల్లో రెడ్ క్రాస్ విశిష్ట సేవలు అందిస్తోందని వివరించారు.జిల్లాలో రక్తనిధుల నిల్వలను పెంపొందించేందుకు యువత ముందుకు రావాల్సిన అవసరం ఉందని,ప్రతి ఆరోగ్యవంతుడు క్రమం తప్పకుండా రక్తదానం చేయడం ద్వారా ఎన్నో ప్రాణాలను కాపాడవచ్చని సూచించారు.రెడ్ క్రాస్ సభ్యత్వం కేవలం ఒక గుర్తింపు మాత్రమే కాకుండా సమాజం పట్ల బాధ్యతను చాటిచెప్పే వేదికగా నిలుస్తుందని పేర్కొన్నారు.అనంతరం మేయర్ ధరణి మధుకర్ మాట్లాడుతూ,మానవతా విలువలను పరిరక్షిస్తూ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న రెడ్ క్రాస్ కార్యకలాపాలు ప్రశంసనీయమన్నారు.ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలకు తమవంతు సహకారం అందించేందుకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటామని తెలిపారు.సేవా తత్పరత కలిగిన ప్రతి ఒక్కరూ రెడ్ క్రాస్ వంటి సంస్థలతో అనుబంధం పెంచుకోవాలని సూచించారు.రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న సభ్యత్వ నమోదు కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తోందని, సమాజ సేవ పట్ల ఆసక్తి కలిగిన మరింత మంది ముందుకు వచ్చి రెడ్ క్రాస్ కుటుంబంలో భాగస్వాములు కావాలని నిర్వాహకులు కోరారు.ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ ప్రతినిధులు,కార్పొరేషన్ సిబ్బంది,సేవా కార్యకర్తలు,సభ్యత్వ నమోదు బృందం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Related posts

డెంగ్యూ నివారణకు ప్రజల సహకారం అవసరం: మేయర్ ధరణి మధుకర్_ డిఎంహెచ్ఓ డాక్టర్ ఎస్.అనిత

వరి కొనుగోలు కేంద్రాల్లో వడదెబ్బపై అవగాహన: మాస్ మీడియా అధికారి బుక్క వెంకటేశ్వర్లు

కాలేశ్వరం సరస్వతి పుష్కరాలలో పాల్గొన్న బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్*

Share this