September 11, 2026
Praja Telangana
తెలంగాణ

“మేరా భారత్ మహాన్” థీమ్‌తో ఈనెల 24న వివిధ పోటీలు

హనుమకొండ,మే19:హనుమకొండకు చెందిన ప్రముఖ చిత్రకారిణి డా.మంజుల సాగంటి స్థాపించిన సాగంటీస్ ఆర్ట్స్ అకాడమీ అండ్ హెల్పింగ్ సొసైటీ 4వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 24న హనుమకొండలోని పబ్లిక్ గార్డెన్ పక్కన ఉన్న టీటీడీ హాలులో వివిధ పోటీలు నిర్వహించనున్నట్లు సంస్థ డైరెక్టర్ డా.మంజుల సాగంటి తెలిపారు.ఆదివారం ఉదయం 10 గంటల నుంచి ప్రారంభమయ్యే ఈ కార్యక్రమంలో డ్రాయింగ్,వ్యాసరచన, దేశభక్తి గీతాల పాటల పోటీలు,దేశ నాయకుల నినాదాల పోటీలు,సంప్రదాయ దుస్తుల పోటీలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.“మేరా భారత్ మహాన్” అనే అంశంపై పోటీలు జరుగనున్నాయని,విభాగాల వారీగా పోటీలు నిర్వహించి పాల్గొన్న ప్రతి ఒక్కరికీ సర్టిఫికెట్లు అందజేయనున్నట్లు తెలిపారు. ప్రథమ, ద్వితీయ,తృతీయ బహుమతులు కూడా ప్రదానం చేయనున్నట్లు వెల్లడించారు. ఆసక్తి గల వారు 8143643337 నంబర్‌ను సంప్రదించాలని సూచించారు.

Related posts

సబ్ జూనియర్ అథ్లెటిక్స్ పోటీలలో పతకాలు సాధించిన బెల్లంపల్లి విద్యార్థులు.

Chief Editor: Satish Kumar

*రామకృష్ణాపూర్‌లో రోడ్డు భద్రతపై పోలీసుల అవగాహన కార్యక్రమం.. ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచన*

Share this