మంచిర్యాల జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఎస్. అనిత చెన్నూరు బస్తీ దవాఖానా,భీమారం,అంగరాజుపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు,చెన్నూరులో నిర్మాణంలో ఉన్న అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా సందర్శించి వైద్య సేవలను పరిశీలించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు,బస్తీ దవాఖానాల ద్వారా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నామని తెలిపారు.30 ఏళ్లు పైబడిన వారికి బీపీ, షుగర్, క్యాన్సర్ వంటి అసంక్రమణ వ్యాధుల పరీక్షలు నిర్వహించి మందులు అందించాలని సూచించారు.14 ఏళ్ల బాలికలకు హెచ్పీవీ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ముమ్మరం చేయాలని ఆదేశించారు.వేసవి తీవ్రత దృష్ట్యా ప్రజలు వడదెబ్బ,డీహైడ్రేషన్ బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని,ఓఆర్ఎస్ వినియోగించాలని సూచించారు. గ్రామాల్లో వైద్య శిబిరాలు నిర్వహించి ప్రతి ఇంటికి ఆరోగ్య సేవలు అందించాలని వైద్య సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు.

