June 13, 2026
Praja Telangana
తెలంగాణ

చట్టవ్యతిరేక కార్యకలాపాలపై ఉక్కుపాదం__ ఇతర రాష్ట్రాల కార్మికుల వివరాలు నమోదు తప్పనిసరి : మంచిర్యాల డీసీపీ ఏ.భాస్కర్

ప్రజల భద్రత,నేరాల నియంత్రణ,అసాంఘిక కార్యకలాపాల అడ్డుకట్టకు కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహిస్తున్నామని మంచిర్యాల డీసీపీ ఏ.భాస్కర్ తెలిపారు.సిసిసీ నస్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సంఘమల్లయ్యపల్లె గ్రామంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ప్రజలకు పలు సూచనలు చేశారు.ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన కార్మికుల పూర్తి వివరాలను ఇళ్ల యజమానులు తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని సూచించారు.గ్రామాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని,మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలని కోరారు.ఎవరైనా చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని తెలిపారు.అనంతరం పోలీసులు వాహనాల తనిఖీలు నిర్వహించి జరిమానాలు విధించారు.

Related posts

బీసీ కుల సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో జ్యోతిరావు పూలే వర్ధంతి వేడుకలు

*అరైవ్ అలైవ్ లక్ష్యంగా గ్రామసభల్లో రోడ్డు భద్రతా చైతన్యం*

మూడు దశాబ్దాల ప్రజాసేవకు వీడ్కోలు___ హోంగార్డ్ శ్రీనివాస్‌కు పోలీస్ శాఖ ఘన నివాళి

Chief Editor: Satish Kumar
Share this