July 29, 2026
Praja Telangana
తెలంగాణ

యోగతో ఆరోగ్యం.. విద్యార్థులకు అవగాహన కల్పించిన చైతన్య సుధా

మంచిర్యాల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 99 రోజుల ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా, సీసీఈ హైదరాబాద్ ఆదేశాల మేరకు నిర్వహిస్తున్న విద్యాశాఖ వారోత్సవాలలో రెండవ రోజు యోగపై అవగాహన కార్యక్రమాన్ని కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ జై కిషన్ ఓజా ఆధ్వర్యంలో నిర్వహించారు.ఈ సందర్భంగా కార్యక్రమానికి అతిథిగా యోగ గురువు మందాల చైతన్య సుధా హాజరై నిత్యజీవితంలో యోగ పాత్ర, యోగాసనాల ప్రాముఖ్యతపై విద్యార్థులకు అవగాహన కల్పించారు.అనంతరం ఆమె మాట్లాడుతూ యోగాసనాలను ప్రతిరోజూ అభ్యసించడం ద్వారా శారీరక ఆరోగ్యం మెరుగుపడటంతో పాటు మానసిక ప్రశాంతత, ఏకాగ్రత పెరుగుతాయని తెలిపారు.వివిధ యోగాసనాలను ప్రదర్శిస్తూ వాటి వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలను వివరించారు.యోగా అనేది ప్రతి మనిషి నిత్యజీవితంలో ఒక నిత్యావసరంగా మార్చుకుని, ప్రతిరోజూ ఆచరించాలని సూచించారు.ఈ కార్యక్రమానికి ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ మంచిర్యాల జిల్లా జనరల్ సెక్రటరీ చందూరి మహేందర్ హాజరయ్యారు.అనంతరం ప్రిన్సిపల్ ప్రొఫెసర్ జై కిషన్ ఓజా అతిథులను సన్మానించారు.ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు,అధ్యాపకేతర సిబ్బంది,విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Related posts

ఘనంగా మేయర్, డిప్యూటీ మేయర్, కార్పొరేటర్ల ప్రమాణ స్వీకారం

Chief Editor: Satish Kumar

బీసీ కుల సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో జ్యోతిరావు పూలే వర్ధంతి వేడుకలు

బెల్లంపల్లి: ‘భూభారతి రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలి’

Share this