July 29, 2026
Praja Telangana
తెలంగాణ

వరి కొనుగోలు కేంద్రాల్లో వడదెబ్బపై అవగాహన: మాస్ మీడియా అధికారి బుక్క వెంకటేశ్వర్లు

మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలంలోని పర్దనపల్లి, కర్ణమామిడి వరి కొనుగోలు కేంద్రాల్లో జిల్లా మాస్ మీడియా అధికారి బుక్క వెంకటేశ్వర్ వడదెబ్బ నివారణపై రైతులు, కార్మికులకు అవగాహన కల్పించారు. ఓఆర్ఎస్ వినియోగం, ఎక్కువగా నీరు మరియు ద్రవపదార్థాలు తీసుకోవడం, మండుటెండల్లో బయట తిరగకుండా జాగ్రత్తలు పాటించాలని సూచించారు. వడదెబ్బ లక్షణాలు కనిపిస్తే వెంటనే నీడ ప్రాంతానికి తరలించి ఓఆర్ఎస్ లేదా గ్లూకోజ్ ద్రావణం ఇవ్వాలని తెలిపారు. కార్యక్రమంలో పీహెచ్‌సీ, ఐకేపీ సిబ్బంది,రైతులు తదితరులు పాల్గొన్నారు.

Related posts

బెల్లంపల్లి, అంబేడ్కర్ విగ్రహం వద్ద చెత్తను తక్షణం తొలగించాలని డిమాండ్

*పవన్ కళ్యాణ్‌ను పరామర్శించిన గవర్నర్ అబ్దుల్ నజీర్*

కేసీఆర్ హయాంలోనే దుబ్బాక నియోజకవర్గం సస్యశ్యామలం

Share this