September 12, 2026
Praja Telangana
తెలంగాణ

కిక్ బాక్సింగ్‌లో రామకృష్ణాపూర్ క్రీడాకారుల సత్తా.. ఎనిమిది మందికి బంగారు పతకాలు

మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం మాదారం టౌన్షిప్ సింగరేణి హాల్లో గత నెల 28న నిర్వహించిన జిల్లా స్థాయి కిక్ బాక్సింగ్ పోటీల్లో రామకృష్ణాపూర్‌కు చెందిన క్రీడాకారులు ప్రతిభ కనబరిచి బంగారు పతకాలు సాధించారు.ఈ పోటీల్లో తస్విక,మనీష్,సమ్ వేధ్య,శ్రావ్య,ఆరోహి,మౌనిక,మాధురి, అశ్విత్‌లు వివిధ వెయిట్ కేటగిరీలలో గోల్డ్ మెడల్స్ గెలుచుకొని పట్టణానికి కీర్తి తీసుకురావడం జరిగింది.ఈ సందర్భంగా రామకృష్ణాపూర్ ఎస్సై శ్రీధర్ క్రీడాకారులను,కోచ్ జూల శ్రీనివాస్‌ను అభినందించి నగదు పారితోషికాలు అందజేసి సన్మానించడం జరిగింది.అనంతరం ఎస్సై శ్రీధర్ మాట్లాడుతూ చిన్నారులు మొబైల్ ఫోన్లకు అలవాటు పడుతున్న తరుణంలో క్రీడలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని ఆయన పేర్కొన్నారు.ముఖ్యంగా కిక్ బాక్సింగ్ ద్వారా పిల్లల్లో ఆత్మరక్షణ నైపుణ్యాలు పెంపొందడంతో పాటు మానసిక,శారీరక దృఢత్వం అభివృద్ధి చెందుతుందని తెలిపారు.క్రీడాకారుల విజయానికి కోచ్ జూల శ్రీనివాస్ కృషి అభినందనీయమని పలువురు ప్రశంసించారు.

Related posts

మాదిగ హక్కుల దండోరా బెల్లంపల్లి పట్టణ అధ్యక్షులుగా కాంపల్లి సతీష్ మాదిగ*

*సెప్టెంబర్ 12న లోక్ అదాలత్.. ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి: జూనియర్ సివిల్ జడ్జ్ శ్రీమతి నిరోష*

Chief Editor: Satish Kumar

*ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నూతన విద్యార్థులకు స్వాగతం.. ఓరియంటేషన్ కార్యక్రమం నిర్వహణ*

Share this