September 12, 2026
Praja Telangana
తెలంగాణ

ఆర్టీసీ కార్మికుడు శంకర్ గౌడ్ కుటుంబానికి కేటీఆర్ పరామర్శ.. రూ.5 లక్షల ఆర్థిక సాయం

ఆర్టీసీ సమ్మె సమయంలో ఆత్మబలిదానం చేసుకున్న కార్మికుడు శంకర్ గౌడ్ కుటుంబాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మంగళవారం పరామర్శించారు. కుటుంబ సభ్యులను ఓదార్చిన ఆయన,వారి బాధలో పార్టీ అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు.ఈ సందర్భంగా మాట్లాడిన కేటీఆర్,శంకర్ గౌడ్ ఆత్మత్యాగం కార్మిక వర్గాన్ని తీవ్రంగా కలచివేసిందన్నారు.ఇటువంటి దుర్ఘటనలు మళ్లీ చోటుచేసుకోకుండా ప్రభుత్వం కార్మికుల సమస్యలపై తక్షణమే స్పందించాలని కోరారు.ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు.బాధిత కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ తరఫున రూ.5 లక్షల ఆర్థిక సాయాన్ని కేటీఆర్ అందజేశారు. కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని,న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.శంకర్ గౌడ్ కుటుంబ సభ్యులు కేటీఆర్‌కు కృతజ్ఞతలు తెలుపుతూ, తమ కుటుంబానికి న్యాయం జరిగేలా సహకరించాలని విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు,కార్యకర్తలు పాల్గొన్నారు.

Related posts

*ఎసన్వాయి గ్రామంలో గుడుంబా స్థావరాలపై పోలీసు–ఎక్సైజ్ సంయుక్త ఉక్కుపాదం*

*క్షయ వ్యాధి నియంత్రణకు నస్పూర్‌లో ప్రత్యేక వైద్య శిబిరం*

*యోగా సాధనతో సంపూర్ణ ఆరోగ్యం సాధ్యం.. ఆరోగ్యకరమైన జీవనశైలికి యోగా ఎంతో అవసరం : మేయర్ ధరణి మధుకర్*

Share this