July 29, 2026
Praja Telangana
తెలంగాణ

సమానత్వంకై మహాత్మా జ్యోతిబాపూలే చేసిన కృషి చిరస్మరణీయం

జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) పి.చంద్రయ్య

సామాజిక న్యాయం, విద్యా విస్తరణ, సమానత్వం కోసం మహాత్మ జ్యోతిబాపూలే చేసిన కృషి చిరస్మరణీయమని జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) పి.చంద్రయ్య అన్నారు. మహాత్మ జ్యోతిబాపూలే జయంతిని పురస్కరించుకొని శనివారం జిల్లాలోని నస్పూర్ లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సమావేశం మందిరంలో జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కార్యక్రమానికి మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ దర్ని మధుకర్, డిప్యూటీ మేయర్ సల్లా రమ్య, జిల్లా షెడ్యూల్డ్ కులముల అభివృద్ధి శాఖ ఉపసంచాలకులు చాతరాజుల దుర్గాప్రసాద్, జిల్లా వ్యవసాయ అధికారి సురేఖ, వివిధ శాఖల అధికారులు, బి. సి. సంఘాల ప్రతినిధులతో కలిసి మహాత్మ జ్యోతిబాపూలే చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ సామాజిక న్యాయం, విద్యా విస్తరణ, సమానత్వం కోసం మహాత్మ జ్యోతిబాపూలే విశేష కృషి చేశారని తెలిపారు. పేదలు, మహిళలు, వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి అందించిన సేవలు అందరికీ స్ఫూర్తిదాయకమని తెలిపారు. మహనీయుల ఆశయాలను ఆదర్శంగా తీసుకొని సమాజంలో సమానత్వం కోసం, అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు, వివిధ బి.సి. సంఘాల ప్రతినిధులు, వసతి గృహ సంక్షేమ అధికారులు, కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Related posts

*సింగరేణి ఐరన్ పైపుల అక్రమ రవాణా గుట్టురట్టు.. సివిల్ సూపర్వైజర్, స్క్రాప్ వ్యాపారి సహా ఆరుగురు అరెస్ట్*

వరి కొనుగోలు కేంద్రాల్లో వడదెబ్బపై అవగాహన: మాస్ మీడియా అధికారి బుక్క వెంకటేశ్వర్లు

*హెపటైటిస్ నివారణకు అప్రమత్తతే రక్షణ.. ప్రపంచ హైపటైటిస్ దినోత్సవం సందర్భంగా ప్రజలకు అవగాహన ర్యాలీ*

Chief Editor: Satish Kumar
Share this