ఛైర్‌పర్సన్‌గా గోడిశెల సంధ్యారాణి
వైస్ ఛైర్‌పర్సన్‌గా మిట్టపల్లి సరిత
మంచిర్యాల జిల్లాలోని క్యాతనపల్లి మున్సిపాలిటీలో బీఆర్‌ఎస్ పార్టీ ఘన విజయం సాధించింది. మొత్తం 50 వార్డులున్న ఈ మున్సిపాలిటీలో అన్ని స్థానాలను కైవసం చేసుకుని క్లీన్ స్వీప్ నమోదు చేసింది. అనంతరం జరిగిన ఎన్నికల్లో ఛైర్‌పర్సన్‌గా గోదిశెల సంధ్యారాణి, వైస్ ఛైర్‌పర్సన్‌గా మిట్టపల్లి సరిత ఎన్నికయ్యారు.ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తన పట్టును నిరూపించుకునేందుకు ప్రయత్నించినప్పటికీ ఆశించిన ఫలితాలు సాధించలేకపోయింది. మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు గోదిశెల సంధ్యారాణి, వైస్ ఛైర్‌పర్సన్‌గా మిట్టపల్లి సరిత సారథ్యంలో స్థానిక సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వడం, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం వంటి అంశాలు విజయానికి దోహదపడ్డాయి.
ఎన్నికల ఫలితాల అనంతరం పార్టీ శ్రేణులు ఆనందోత్సాహాలు వ్యక్తం చేస్తూ సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ప్రజలు మరోసారి బీఆర్‌ఎస్‌పైనే విశ్వాసం ఉంచారని, మున్సిపాలిటీ పరిధిలో అభివృద్ధి కార్యక్రమాలను మరింత వేగవంతం చేస్తామని తెలిపారు.

