July 29, 2026
Praja Telangana
తెలంగాణ

క్యాతనపల్లి మున్సిపల్ పాలకవర్గం ఎన్నిక_జిల్లా అదనపు కలెక్టర్ పి.చంద్రయ్య

* జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) పి.చంద్రయ్

మున్సిపల్ సాధారణ ఎన్నికల నేపథ్యంలో క్యాతనపల్లి మున్సిపల్ చైర్‌పర్సన్, వైస్ చైర్‌పర్సన్ ల పరోక్ష ఎన్నికలు నిర్వహించడం జరిగిందని జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) పి.చంద్రయ్య అన్నారు.శనివారం క్యాతనపల్లి మున్సిపాలిటీ కార్యాలయంలో జరిగిన ఎన్నిక కార్యక్రమానికి బెల్లంపల్లి సబ్ కలెక్టర్, ఎన్నికల పరిశీలకులు మనోజ్, క్యాతనపల్లి మున్సిపల్ కమిషనర్ మారుతి ప్రసాద్ లతో కలిసి హాజరయ్యారు.ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ మున్సిపల్ పాలకవర్గం పరీక్ష ఎన్నికకు ఎన్నికల సంఘం ఆదేశాల ప్రకారం చర్యలు తీసుకోవడం జరిగిందని తెలిపారు.ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా ఉండేందుకు ప్రత్యక్ష ప్రసారం ఏర్పాట్లు  చేయడం జరిగిందని, ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయని తెలిపారు. క్యాతనపల్లి మున్సిపల్ చైర్ పర్సన్ గా గొడిసెల సంధ్యారాణి, వైస్ చైర్ పర్సన్ గా మిట్టపెల్లి సరిత లను ఎన్నుకోవడం జరిగిందని తెలిపారు.ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Related posts

*కన్నెపల్లి పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన డీసీపీ ఎగ్గడి భాస్కర్*

Chief Editor: Satish Kumar

*వర్షంలోనూ విధి నిర్వహణకు అండగా.. పోలీస్ సిబ్బందికి రెయిన్‌కోట్లు అందజేసిన సీపీ అంబర్ కిషోర్ ఝా*

*వెంకటాపూర్‌లో కమ్యూనిటీ పోలీసింగ్‌కు కొత్త దిశ.. ఉచిత వైద్య శిబిరంతో పోలీసుల సేవాభావం*

Share this