June 13, 2026
Praja Telangana
తెలంగాణ

శ్రీరామనవమి సందర్భంగా హనుమాన్ మాల ధారణతో హోమం నిర్వహణ

మార్చి 28న హైటెక్ సిటీలో ప్రత్యేక కార్యక్రమం – పెద్దఎత్తున పాల్గొనాలని పిలుపు

శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు వెరబెల్లి రఘునాథ్ ఆధ్వర్యంలో హనుమాన్ మాల ధారణతో పాటు హనుమాన్ మన్యు సూక్త హోమం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం మార్చి 28, 2026 శనివారం హైటెక్ సిటీలోని ఆయన నివాసంలో జరగనుంది.ఈ సందర్భంగా పట్టణంలోని హనుమాన్ స్వాములు, హిందూ బంధువులు, వివిధ క్షేత్రాల కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని నిర్వాహకులు విజ్ఞప్తి చేశారు. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు తమ తమ ప్రాంతాల్లోని దేవాలయాలను సందర్శించి గురుస్వాములు, పూజారుల ద్వారా భక్తులను ఆహ్వానించి కార్యక్రమానికి హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని కోరారు.దేవాలయాల్లో ఉదయం హారతి సమయంలో స్వాములు ఎక్కువగా ఉండే అవకాశమున్నందున ఆ సమయంలో వెళ్లి ఆహ్వానాలు అందించాలని సూచించారు.

🚩 హనుమాన్ శక్తి జాగరణ – హిందూ శక్తి సంఘటన 🚩
🚩 జై శ్రీరామ్ – జై హనుమాన్ 🚩

Related posts

Chief Editor: Satish Kumar

వ్యవసాయ రంగంలో దళారి వ్యవస్థను నిర్మూలించాలి

Chief Editor: Satish Kumar

ఆదిలాబాద్: ఈ నెల 23న జూనియర్ వాలీబాల్ ఎంపిక పోటీలు

Share this