Praja Telangana
తెలంగాణ

డాక్టర్ సుతి గోలి గారికి బహుజన్ సమాజ్ పార్టీ ఘన సన్మానం

*డాక్టర్ సుతి గోలి గారికి బహుజన్ సమాజ్ పార్టీ ఘన సన్మానం*

డాక్టర్ గైనకాలజిస్ట్/ సామాజిక కార్యకర్త డాక్టర్ శృతి గోలి గారి జన్మదిన వేడుకలో బహుజన్ సమాజ్ పార్టీ ఈరోజు పుష్పగుచ్చము ఇచ్చి శాలువాతో సన్మానించినారు అనంతరం బీఎస్పీ పార్టీ జిల్లా నాయకులు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా మంచిర్యాల జిల్లా ఇన్చార్జి నాగుల కిరణ్ బాబు గారు మాట్లాడుతూ
​వైద్య రంగంలో ఆమె కనబరుస్తున్న ప్రతిభ, రోగుల పట్ల ఆమెకు ఉన్న అంకితభావం అభినందనీయం. తన వృత్తి జీవితంలో ఎన్నో క్లిష్టమైన కేసులను విజయవంతంగా పూర్తి చేసి, ఎందరో ప్రాణాలను కాపాడిన డాక్టర్ శృతి, ఇటీవల ఎన్నో అవార్డు అందుకున్నారు
“డాక్టర్ శృతి గోలి గారు కేవలం మంచి వైద్యురాలే కాదు, అంతకు మించి మంచి మనసున్న వ్యక్తి. ఆమె సేవలు సమాజానికి ఎంతో అవసరం. ఆమె మరెన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని, సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని కోరుకుంటున్నాము” అని ఆకాంక్షించారు.
​వృత్తిపరమైన బాధ్యతలే కాకుండా, సామాజిక సేవా కార్యక్రమాల్లో కూడా ఆమె చురుగ్గా పాల్గొంటూ ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తున్నారు అన్ని వారు కొనియాడారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా జోనల్ ఇంచార్జ్ కాదాసీ రవీందర్ జిల్లా ఇంచార్జ్ దాగం శ్రీనివాస్ మందమర్రి పట్టణ అధ్యక్షులు గాజుల శంకర్ తిరుపతి వినయ్ తదితరులు పాల్గొన్నారు

Related posts

బెల్లంపల్లి గురుకుల విద్యార్థుల ఆందోళన

ఇక గ్యాస్ సిలిండర్ 500 కే.. ప్రతి ఇంట్లోకి రానున్న మరో రెండు గ్యారెంటీలు…మహిళ శుభవార్త చెప్పిన రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క..

మోడిని బలపర్చండి – దేశాన్ని కాపాడండి

Share this