July 29, 2026
Praja Telangana
ఆంధ్రప్రదేశ్

బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) మందమర్రి పట్టణలో సావిత్రిబాయి పూలే 195 జయంతి ని నిర్వహించిన కార్యక్రమాన్ని మందమర్రి పట్టణ అధ్యక్షులు గాజుల శంకర్ గారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో బీఎస్పీ పార్టీ మంచిర్యాల జిల్లా ఇంచార్జ్ నాగుల కిరణ్ బాబు దాగం శ్రీనివాస్ ముఖ్య అతిథులుగా విచ్చేసి పూలమాల వేశారు. అనంతరం జిల్లా ఇంచార్జ్ నాగుల కిరణ్ బాబు గారు మాట్లాడుతూ సావిత్రిబాయి పూలే గారు చేసిన సేవలు మరువలేనివి బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి భారత దేశ మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు ఈరోజు అన్ని వర్గాలలో స్త్రీలు ముందున్నారంటే కేవలం ఆనాడు సావిత్రిబాయి పూలే గారు చేసిన పుణ్యమే ఆనాడు కేవలం వంటింటి కె పరిమితమైన స్త్రీలకు చదువు ద్వారానే సామాజిక న్యాయం జరుగుతుందని ఆడవారికి చదువు నేర్పించిన మహా మూర్తి సావిత్రిబాయి పూలే అలాంటి సావిత్రిబాయి పూలే గారిని ఈరోజు మనం ఘనంగా వారి జయంతి జరుపుకోవడం చాలా సంతోషకరమని వారు తెలియజేశారు
ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా నాయకులు మతిన్ ఖాన్, మందమరి మండల అధ్యక్షులు రహీం బాబా, రామకృష్ణాపూర్ పట్టణ అధ్యక్షులు బొల్లి నరేష్, ఆయిల్లా లక్ష్మణ్, తిపాని శ్రీనివాస్ రవి, తిరుపతి గోపి పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు:

Related posts

test post

*జనసేన పుట్టిందే తెలంగాణలో__రాష్ట్ర రాజకీయాల్లో క్రియాశీల పాత్ర పోషిస్తాం: పవన్ కళ్యాణ్*

Chief Editor: Satish Kumar
Share this