June 3, 2026
Praja Telangana
తెలంగాణ

డాక్టర్స్ సెల్ జిల్లా కోఆర్డినేటర్‌గా రాజ్‌కుమార్ నియామకం

డాక్టర్స్ సెల్ జిల్లా కోఆర్డినేటర్‌గా రాజ్‌కుమార్ నియామకం

తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలోని డాక్టర్స్ సెల్ మెడికల్ & హెల్త్ విభాగంలో జిల్లా కోఆర్డినేటర్‌గా కొత్తపల్లి రాజ్‌కుమార్‌ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.ఈ నియామక ఉత్తర్వులను టీపీసీసీ డాక్టర్స్ సెల్ రాష్ట్ర చైర్మన్ డా. ఎం. రాజీవ్ 20-12-2025న విడుదల చేశారు. ఈ నియామకం తక్షణమే అమల్లోకి వస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ బి. మహేష్ కుమార్ గౌడ్ నాయకత్వంలో సమన్వయంతో పనిచేయాలని, ప్రజారోగ్య రంగాన్ని బలోపేతం చేయడంలో డాక్టర్స్ సెల్ కీలక పాత్ర పోషించాలని డా. రాజీవ్ ఆకాంక్ష వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా కొత్తపల్లి రాజ్‌కుమార్ మాట్లాడుతూ, తనపై ఈ బాధ్యతను అప్పగించినందుకు పార్టీ నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు పార్టీ బలోపేతానికి నిరంతరం కృషి చేస్తానని తెలిపారు. ప్రజారోగ్య పరిరక్షణ, వైద్య సేవల విస్తరణకు డాక్టర్స్ సెల్‌ను మరింత చురుకుగా ముందుకు తీసుకెళ్తామని ఆయన పేర్కొన్నారు.

Related posts

ఎల్ నినో’ ప్రభావం తీవ్రతరం – ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నిపుణుల హెచ్చరిక

శ్రీరామనవమి సందర్భంగా హనుమాన్ మాల ధారణతో హోమం నిర్వహణ

పవన్ కళ్యాణ్ ఆశయాలతో జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు

Chief Editor: Satish Kumar
Share this