*సిర్పూర్ నియోజకవర్గ అభివృద్ధికై భారతీయ జనతా పార్టీకి ఓటు వేయండి – భారతీయ జనతా పార్టీ ఎంపీ అభ్యర్థి శ్రీ గోడం నగేష్ అభ్యర్థన*
*కాగజ్ నగర్ :* పట్టణంలోని పటేల్ గార్డెన్స్ లో ఈరోజు భారతీయ జనతా పార్టీ బూత్ సమ్మేళనం నిర్వహించడం జరిగింది.
*ఈ కార్యక్రమంలో పాల్గొన్న భారతీయ జనతా పార్టీ ఎంపీ అభ్యర్థి శ్రీ గోడం నగేష్ మాట్లాడుతూ సిర్పూర్ నియోజకవర్గ ప్రజలు పెద్ద ఎత్తున పార్లమెంట్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి మద్దతు తెలపాలని, తద్వారా మోదీ ప్రభుత్వానికి శక్తిని ఇవ్వాలని కోరడం జరిగింది. జాతీయ రహదారులు మరియు రైల్వేల అభివృద్ధి కోసం సిర్పూర్ ఎమ్మెల్యే డా.పాల్వాయి హరీష్ బాబు గారితో కలిసి పనిచేస్తామని తెలిపారు.*
*ఈ సందర్భంగా సిర్పూర్ శాసన సభ్యులు డా.పాల్వాయి హరీష్ బాబు మాట్లాడుతూ ఇదివరకే జిల్లాలో ఒక జాతీయ రహదారి పూర్తయిందని, ఇంకో జాతీయ రహదారి మంజూరైందని తెలిపారు. గ్రామాల అభివృద్ధి మరియు కాగజ్ నగర్ పట్టణ అభివృద్ధి కోసం భారతీయ జనతా పార్టీకి ఓటు వేసి గెలిపించాలని కోరడం జరిగింది.*
ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ శాసన సభ్యులు పాయల్ శంకర్ గారు, భాజపా జిల్లా అధ్యక్షులు డా కొత్తపల్లి శ్రీనివాస్ గారు, మాజీ జిల్లా పరిషత్ ఛైర్ పర్సన్ చిట్యాల సుహాసిని రెడ్డి గారు, అల్జాపూర్ శ్రీనివాస్ గారు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కొంగ సత్యనారాయణ గారు, రాష్ట్ర ఓబీసీ మోర్చ నాయకులు గోలెం వెంకటేష్ గారు, జిల్లా ప్రధాన కార్యదర్శి ధోని శ్రీశైలం గారు, అసెంబ్లీ కన్వీనర్ గొల్లపల్లి వీరభద్ర చారి గారు, పట్టణ అధ్యక్షులు సిందం శ్రీనివాస్ గారు, జిల్లా మహిళా అధ్యక్షురాలు వలుపదాసు శ్రీదేవి గారు, చిప్ప మౌనిక గారు మరియు అన్ని మండలాల అధ్యక్షులు, భూత్ అధ్యక్షులు పాల్గొన్నారు.