*బీఆరెస్ మాజీ ఎమ్మెల్యే నడిపెళ్లి దివాకర్ రావు వైఫల్యాలు,కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు సేవలు కాంగ్రెస్ పార్టీ విజయానికి కారణం*
*మంచిర్యాల జిల్లా:మార్చి 26 (ప్రజా తెలంగాణ న్యూస్ ఎడిటర్)*
మంచిర్యాల జిల్లా కేంద్రంలో గల ఎమ్మెల్యే ప్రేమ సాగర రావు స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు పూదరి తిరుపతి,తూముల నరేష్ మాట్లాడుతూ దివాకర్ రావు 20 యేండ్లు ఏమ్మెల్యే పదవి అనుభవించి ప్రజలకు చేసిన సేవలు శూన్యమని విమర్శించారు.స్వార్ధం తప్ప ప్రజాపలనపై దివాకర్ రావు కు ఎప్పుడు ప్రేమ లేదని ధ్వజమెత్తారు.అభివృద్ధి, సంక్షేమంను విస్మరించడం వల్లనే దివాకర్ రావును ప్రజలు చిత్తుగా ఓడించారని గుర్తు చేశారు.ప్రజల కు ప్రేమ పాత్రుడైన ప్రేమ్ సాగర్ రావును ఎమ్మెల్యే గా ప్రజలు భారీ మెజారిటీతో గెలిపించారని తెలిపారు. ఎమ్మెల్యేగా గెలిచిన వందరోజుల్లోనే నియోజవర్గంకు 200 కోట్లకు పైగా నిధులు తీసుకువచ్చిన ఘనత ప్రేమ్ సాగర్ రావుకు దక్కిందన్నారు.కార్మిక,కర్షక, శ్రామిక సమస్యలను పరిష్కరించడానికి ప్రేమ్ సాగర్ రావు కృషి చేస్తున్నారన్నారు అని తెలిపారు.ప్రేమ్ సాగర్ రావు సారథ్యంలోనే అభివృద్ధి సాధ్యమని ఈ సందర్భంగా తెలియజేశారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు మహిళా నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.