October 27, 2026
Praja Telangana
తెలంగాణ

*ఆత్మీయ చారిటబుల్ ట్రస్ట్ నూతన కార్యవర్గం ఎన్నిక.. అధ్యక్షుడిగా కల్వల సంపత్*

రామకృష్ణాపూర్,అక్టోబర్ 22(నేటి ప్రజా తెలంగాణ):ఆత్మీయ చారిటబుల్ ట్రస్ట్ నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ట్రస్ట్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలను మరింత విస్తృతం చేస్తూ, సమాజ అభ్యున్నతికి కృషి చేయాలనే లక్ష్యంతో వివిధ పదవులకు సభ్యులను ఎంపిక చేశారు.నూతన కార్యవర్గంలో గౌరవ అధ్యక్షుడిగా జెట్టి శ్రీనివాస్, అధ్యక్షుడిగా కల్వల సంపత్, ప్రధాన కార్యదర్శిగా గజ్జల తిరుపతి, ఉపాధ్యక్షుడిగా వి. నాగభూషణం, కోశాధికారిగా తూముల సురేష్, ప్రచార కార్యదర్శిగా ఎం. సురేష్ ఎన్నికయ్యారు.ఈ సందర్భంగా నూతన కార్యవర్గ సభ్యులకు ట్రస్ట్ కమిటీ సభ్యులు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. నూతన బాధ్యతలు చేపట్టిన సభ్యులు సమష్టిగా పనిచేస్తూ ట్రస్ట్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని ఆకాంక్షించారు. ప్రజలకు ఉపయోగపడే సేవా కార్యక్రమాలను చేపడుతూ, సమాజంలోని అవసరమైన వారికి అండగా నిలవాలని సూచించారు. ట్రస్ట్ అభివృద్ధితో పాటు ప్రజాసేవలో మరింత చురుకైన పాత్ర పోషించాలని సభ్యులు ఆశాభావం వ్యక్తం చేశారు.

Related posts

*జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిగా డాక్టర్ నరేందర్ రాథోడ్ బాధ్యతల స్వీకరణ*

*నేత్రదానంతో మరో జీవితానికి వెలుగు.. విద్యార్థులకు కంటి ఆరోగ్యంపై అవగాహన*

ముఖ్యమంత్రిని కలిసిన బెల్లంపల్లి ఎమ్మెల్యే

Share this