మందమర్రి, సెప్టెంబర్ 16 (నేటి ప్రజా తెలంగాణ):మందమర్రి టోల్‌ప్లాజా వద్ద అక్రమంగా పశువులను తరలిస్తున్న మహీంద్రా క్యాంపర్ వాహనాన్ని టాస్క్‌ఫోర్స్ పోలీసులు బుధవారం పట్టుకున్నారు. వాహనంలో తరలిస్తున్న 8 ఆవులు, 4 దూడలు కలిపి మొత్తం 12 పశువులను స్వాధీనం చేసుకున్నారు.రామగుండం పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు టాస్క్‌ఫోర్స్ ఏసీపీ శ్రీనివాస్ రావు నేతృత్వంలో విశ్వసనీయ సమాచారం అందడంతో ఎస్‌ఐ లచ్చన్న సిబ్బందితో కలిసి టోల్‌ప్లాజా వద్ద వాహనాల తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో ఆసిఫాబాద్ జిల్లా నుంచి జగిత్యాల జిల్లా రాజారాంపల్లె మార్కెట్‌కు పశువులను తరలిస్తున్న వాహనాన్ని ఆపి తనిఖీ చేయగా 12 పశువులు ఉన్నట్లు గుర్తించారు.పోలీసులు వాహనాన్ని నిలిపిన సమయంలో డ్రైవర్ వాహనం నుంచి దిగి పరారయ్యాడు. దీంతో పశువులతో పాటు మహీంద్రా క్యాంపర్ వాహనాన్ని స్వాధీనం చేసుకుని తదుపరి చట్టపరమైన చర్యల కోసం మందమర్రి పోలీస్ స్టేషన్‌కు అప్పగించారు. పరారీలో ఉన్న డ్రైవర్ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

