September 11, 2026
Praja Telangana
తెలంగాణ

*లింగాపూర్ ఆరోగ్య ఉపకేంద్రంలో డీఎంహెచ్‌ఓ ఆకస్మిక తనిఖీ*

దండేపల్లి, ఆగస్టు 12:దండేపల్లి మండలంలోని లింగాపూర్ ప్రాథమిక ఆరోగ్య ఉపకేంద్రం, ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ నరేందర్ రాథోడ్ బుధవారం ఆకస్మికంగా సందర్శించారు. కేంద్రంలో అందుతున్న వైద్య సేవలు, సదుపాయాలు, మందుల లభ్యత, జాతీయ ఆరోగ్య కార్యక్రమాల అమలు, వాటికి సంబంధించిన నమోదు వివరాలను పరిశీలించారు.జాతీయ నాణ్యత ప్రమాణాల నిర్ధారణకు అవసరమైన అన్ని ప్రమాణాలు, సూచికలను పూర్తిస్థాయిలో సమకూర్చుకోవాలని వైద్య సిబ్బందిని ఆదేశించారు. రోగులకు అందిస్తున్న వైద్య సేవలు, మౌలిక సదుపాయాలు, మందుల లభ్యతతో పాటు జాతీయ ఆరోగ్య కార్యక్రమాల అమలు, వాటికి సంబంధించిన రికార్డులను పక్కాగా నిర్వహించాలని సూచించారు. ప్రజలకు అవగాహన కల్పించే పోస్టర్లను ఏర్పాటు చేసి, ఆరోగ్య కార్యక్రమాలపై విస్తృతంగా అవగాహన కల్పించాలని ఆదేశించారు.ఈ సందర్భంగా నిర్వహించిన వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి పర్యవేక్షించారు. జిల్లాలోని అన్ని ఆరోగ్య ఉపకేంద్రాల్లో వైద్య సిబ్బంది సమయపాలన పాటిస్తూ ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు. ప్రతి వ్యాక్సినేషన్ కార్యక్రమానికి ముందుగానే పిల్లల వివరాలను సిద్ధంగా ఉంచుకోవాలని, ఆశా కార్యకర్తలు సంబంధిత పిల్లల తల్లిదండ్రులకు ముందస్తుగా సమాచారం అందించాలని ఆదేశించారు.వ్యాక్సినేషన్ వివరాలను యువిన్ పోర్టల్‌లో తప్పనిసరిగా నమోదు చేయాలని, అందుబాటులో ఉన్న వ్యాక్సిన్ల వివరాలను ప్రజలకు తెలియజేయాలని సూచించారు. వ్యాక్సినేషన్‌పై ప్రజలు అడిగే ప్రశ్నలకు సమన్వయంతో సమాధానాలు అందిస్తూ, అవసరమైన వారికి అందుబాటులో ఉన్న వ్యాక్సినేషన్ కేంద్రాలకు పంపించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.అదేవిధంగా 14 సంవత్సరాలు నిండిన బాలికలకు హెచ్‌పీవీ టీకా అందించేలా ప్రత్యేక చర్యలు చేపట్టాలని డాక్టర్ నరేందర్ రాథోడ్ ఆదేశించారు. అర్హులైన బాలికలను గుర్తించి టీకా ప్రాధాన్యతపై తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో జాతీయ నాణ్యత ప్రమాణాల జిల్లా సంచాలకుడు అజ్మీర్ రాజకుమార్, మధ్యస్థాయి ఆరోగ్య ప్రదాత డాక్టర్ సైలేష్, ఆరోగ్య కార్యకర్తలు అరుణ, వైద్య సిబ్బంది, జిల్లా నాణ్యతా సిబ్బంది మౌనిక, శ్వేత, రాజు, తాళ్లపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి చెందిన నర్సింగ్ అధికారులు, వైద్య సిబ్బంది, ఫార్మసీ అధికారి, ప్రయోగశాల సాంకేతిక నిపుణులు తదితరులు పాల్గొన్నారు.

Related posts

ఇద్దరు గంజాయి విక్రేతల అరెస్ట్.. 150 గ్రాముల గంజాయి స్వాధీనం

ఘనంగా టైలర్స్ డే దినోత్సవం వేడుకలు

*మాదక ద్రవ్యాల నియంత్రణతో పాటు రోడ్డు ప్రమాదాల నివారణకు పకడ్బందీ చర్యలు:కలెక్టర్ కుమార్ దీపక్*

Chief Editor: Satish Kumar
Share this