October 4, 2026
Praja Telangana
తెలంగాణ

*మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన కలెక్టర్ కుమార్ దీపక్*

మంచిర్యాల,ఆగస్టు 01:భారీ వర్షాల నేపథ్యంలో శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి భారీగా చేరుతున్న వరద నీరు, ప్రాజెక్టు నీటిమట్టం, నీటి నిల్వ సామర్థ్యాన్ని పరిశీలించేందుకు రాష్ట్ర నీటిపారుదల, ఆహార–పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి, రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుతో కలిసి శనివారం మంచిర్యాల జిల్లాకు విచ్చేశారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, డీసీపీ ఎ.భాస్కర్, మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ధర్ని మధుకర్, ఇతర అధికారులు మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి మొక్కను అందజేశారు.భారీ వర్షాలు, వరదల పరిస్థితుల నేపథ్యంలో ఎల్లంపల్లి ప్రాజెక్టు వద్ద నీటి ప్రవాహం, ప్రాజెక్టు భద్రత, పరిసర ప్రాంతాల పరిస్థితిపై అధికారులు మంత్రికి వివరించారు. వరద పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు.

Related posts

🚨 బిగ్ బ్రేకింగ్: ఛైర్‌పర్సన్‌గా సంధ్యారాణి, వైస్ ఛైర్‌పర్సన్‌గా సరిత ఎన్నిక

Chief Editor: Satish Kumar

హన్మకొండలో RTI బోర్డుల ఏర్పాటు త్వరలో – డి.ఆర్.ఓ హామీ

*మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి.. హానికర విషయాలకు ధైర్యంగా నో చెప్పాలి : మంచిర్యాల డీసీపీ భాస్కర్*

Chief Editor: Satish Kumar
Share this