Praja Telangana
తెలంగాణ

నకిలీ భూమి పత్రాలతో మోసం – ఐదుగురు అరెస్ట్

నకిలీ భూమి పత్రాలు సృష్టించి రూ.31.80 లక్షలు మోసం చేసిన ఘటనలో ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. బెల్లంపల్లి రూరల్ సీఐ చి. హనోక్ తెలిపిన వివరాల ప్రకారం…మంచిర్యాలకు చెందిన సంగం సాగర్‌కు, బుధకూర్ద్ గ్రామానికి చెందిన లాశెట్టి సతీష్ నకిలీ భూమి పత్రాలు చూపించి భూమి అమ్ముతామని నమ్మబలికాడు. ఈ క్రమంలో అగ్రిమెంట్ చేసుకుని విడతల వారీగా మొత్తం రూ.31,80,000 తీసుకున్నాడు. మోసం జరిగినట్లు గుర్తించిన బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.దర్యాప్తులో భాగంగా లాశెట్టి సతీష్‌తో పాటు కట్టా పవన్ కుమార్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా, రామటెంకి హరికృష్ణ, కామెరా రాజు, రామటెంకి శివకుమార్‌లతో కలిసి ఐదుగురు ముఠాగా ఏర్పడి మోసానికి పాల్పడ్డట్లు బయటపడింది. రాంపల్లి గణేష్ పేరిట నకిలీ పట్టాదారు పాస్ పుస్తకం, ఆధార్ కార్డు తయారు చేసి, ఆ వ్యక్తిలా నటిస్తూ బాధితుడిని నమ్మించి భూమి అమ్మకానికి పెట్టి డబ్బులు వసూలు చేసినట్లు పోలీసులు తెలిపారు. తీసుకున్న మొత్తం డబ్బును ఐదుగురు కలిసి పంచుకున్నట్లు విచారణలో ఒప్పుకున్నారు.ఈ మేరకు ఐదుగురిని అరెస్ట్ చేసి బెల్లంపల్లి మేజిస్ట్రేట్ ఎదుట హాజరు పరచగా రిమాండ్ విధించి జైలుకు తరలించారు.ఇలాంటి నకిలీ పత్రాలు తయారు చేయడం లేదా మోసాలకు పాల్పడిన వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ హెచ్చరించారు.

Related posts

ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఉప్పులేటి నరేష్

డాక్టర్ సుతి గోలి గారికి బహుజన్ సమాజ్ పార్టీ ఘన సన్మానం

తెలంగాణలో రేపటి నుంచి రాజీవ్ యువ వికాసం*

Share this