మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ ను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవడం ఖాయమని ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి ప్రజలందరూ కాంగ్రెస్ వైపే ఉన్నారని అన్నారు. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో భాగంగా మంచిర్యాల టూ టౌన్ పట్టణంలో ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్ లో సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ తో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా పేద ప్రజలకు సన్న బియ్యం పంపిణీ చేయడం జరిగిందని అన్నారు. మంచిర్యాల నియోజకవర్గంలో రెండు సంవత్సరాలు కాలంలో 600 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని అన్నారు. ఈ మున్సిపల్ ఎన్నికల్లో మరింత బలం ప్రజలందరూ కల్పిస్తే ఎక్కువ నిధులు తీసుకువచ్చి రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా అభివృద్ధి చేసి చూపిస్తానని ప్రజలకు హామీని ఇచ్చారు. అనంతరం వివిధ పార్టీలకు చెందిన కార్యకర్తలు ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో మాజీ డిసిసి అధ్యక్షులు కొక్కిరాల సురేఖ, కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
previous post

