Praja Telangana
తెలంగాణ

37వ డివిజన్‌లో కాంగ్రెస్ అభ్యర్థి ఎం.డి ఖలీద్ ప్రచారం

37వ డివిజన్‌లో కాంగ్రెస్ అభ్యర్థి ఎం.డి ఖలీద్ ప్రచారం

కాంగ్రెస్ పార్టీ హయాంలోని అభివృద్ధి సాధ్యం

మంచిర్యాల పట్టణంలోని 37వ డివిజన్‌లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎం.డి ఖలీద్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు ఎంతో మేలు చేస్తున్నాయని తెలిపారు. అలాగే స్థానిక ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్ రావు నియోజకవర్గంలో ఇప్పటికే అనేక అభివృద్ధి పనులు చేపట్టారని పేర్కొన్నారు. ఆయన సహకారంతో తనకు ఈ అవకాశం ఇస్తే 37వ డివిజన్‌ను కూడా అభివృద్ధి పథంలో నడిపిస్తూ రోడ్లు, డ్రైనేజీ, తాగునీరు, వీధి దీపాలు వంటి మౌలిక వసతులను మెరుగుపరచి చేసి చూపిస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు స్థానిక ప్రజలు ఈ ప్రచారంలో పాల్గొన్నారు.

Related posts

బి.సి ఢిక్లరేషన్ హామీలను అమలు చేయాలి

Share this