Praja Telangana
తెలంగాణ

బెల్లంపల్లి, అంబేడ్కర్ విగ్రహం వద్ద చెత్తను తక్షణం తొలగించాలని డిమాండ్

బెల్లంపల్లి, అంబేడ్కర్ విగ్రహం వద్ద చెత్తను తక్షణం తొలగించాలని డిమాండ్

బెల్లంపల్లి రైల్వే స్టేషన్ పరిసరాల్లో అంబేడ్కర్ విగ్రహం వద్ద రోజురోజుకు పెరుగుతున్న చెత్త పేరుకుపోవడంపై మాదిగ హక్కుల దండోరా నాయకులు మండిపడ్డారు. ప్రజా ప్రదేశాలను పరిశుభ్రంగా ఉంచాల్సిన బాధ్యతను అధికారులు విస్మరించడంతో విగ్రహం ప్రతిష్టకు భంగం కలుగుతోందని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ నేపథ్యంలో రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు చిలక రాజనర్సు నేతృత్వంలో నాయకులు రైల్వే అధికారిని కలిసి వినతిపత్రం అందజేశారు. విగ్రహం చుట్టూ పేరుకుపోయిన చెత్తను తక్షణం తొలగించి, ఆ ప్రాంతంలో శుభ్రత చర్యలను క్రమబద్ధంగా కొనసాగించాలంటూ వారు విజ్ఞప్తి చేశారు. సమస్యను పట్టించుకోకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టక తప్పదని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో నాయకులు అరుణ్, గోగర్ల శేఖర్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

కార్మిక శాఖ మంత్రి ఏఐటియుసి మందమర్రి జీఎం ఆఫీస్ పిట్ కమిటీ చిరు సత్కారం

కేంద్ర కార్మిక సంఘాల వేదిక దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జూలై 9 కి వాయిదా

Chief Editor: Satish Kumar

ఘనంగా వివేకవర్ధిని డిగ్రీ కళాశాల వీడ్కోలు సమావేశం

Share this