అవకాశం ఇస్తే అభివృద్ధికి ముందుంటా
కోటపల్లి : చిన్న తనం నుండి ప్రజాసేవ మీద మక్కువతో తన తండ్రిని మించిన తనయుడిల అంచెలు అంచెలుగా ఎదుగుతూ తండ్రి గ్రామ సర్పంచ్ గా ఉన్నప్పటి నుండి అతని ప్రోత్సాహంతో రాజకీయ జీవితం మొదలు పెట్టి తెరాస ప్రభుత్వంలో అప్పటి ఉమ్మడి ఆదిలాబాద్ ఎమ్మెల్సీ పురాణం సతీష్ కుమార్ సహకారంతో మంచిర్యాల జిల్లా కోటపల్లి మండల మల్లంపేట గ్రామానికి చెందిన యువకుడు సల్పాల విష్ణు వర్ధన్ యాదవ్ TRSV నియోజకవర్గ జనరల్ సెక్రెటరీ బాధ్యతలు చేపట్టాడు. అప్పటి నుండి ప్రజా సేవలో ముందుకు సాగుతూ తనదైన శైలిలో మంచి సాన్నిహిత్వంతో ఎవరు ఎన్ని వెన్నుపోట్లు పొడిచిన ఎక్కడ భయపడకుండా నిత్యం ప్రజా సేవే లక్ష్యంగా ప్రజలతో మమేకంగా ఉంటూ అందరి మన్నలను పొందుతున్న యువ సామ్రాట్ సల్పాల విష్ణు రాబోయే స్థానిక ఎన్నికలలో గ్రామ సర్పంచ్ పదవికి పోటీలో నిలువనున్నాడు గ్రామ ప్రజలు ఈసారి యువకునికి గ్రామ బాధ్యతలు అప్ప చెప్తే చిత్తశుద్దితో గ్రామ అభివృద్ధికి తోడ్పడుతాడని తన మిత్రబృందం ధీమా వ్యక్తం చేస్తున్నారు.