* బీసీ రిజర్వేషన్ల ప్రదాత, భారత దేశ మాజీ ప్రధాని వీపీ సింగ్ జయంతి వేడుకలు
బీసీ జేఏసీ జిల్లా నాయకులు
నేటి ప్రజా తెలంగాణ: మంచిర్యాల జూన్ 25
మంచిర్యాల జిల్లాలోని ఐబి చౌరస్తాలో మాజీ ప్రధాని బిసి రిజర్వేషన్ల ప్రధాత అయిన వీపీ సింగ్ జన్మదిన వేడుకలను బీసీ జేఏసీ మంచిర్యాల జిల్లా ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా జేఏసీ నాయకులు పూలమాలను వేసి నివాళులు అర్పించడం జరిగింది.అనంతరం బీసీ జేఏసీ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు ఒడ్డేపల్లి మనోహర్ మాట్లాడుతూ అగ్రవర్ణాలకు చెందిన వ్యక్తి అయినప్పటికీ వీపీ సింగ్ దేశంలోమండల్ ఉద్యమాన్ని సందర్భంగా ఈ దేశంలో ఉన్న అట్టడుగు వర్గాలైన బీసీలకు బీపీ మండల్ 40 సిఫార్సులను అమలు చేయడం కోసము తీవ్రంగా ప్రయత్నించడం జరిగిందని తెలిపారు.అప్పుడున్న బిజెపి పార్టీ బీపీ మండల్ సిఫార్సులను తీవ్రంగా వ్యతిరేకించడం జరిగిందని తెలిపారు.అయినా కూడా వీపీ సింగ్ విద్యా,ఉద్యోగ, ఉపాధి రంగాలలో 27% రిజర్వేషన్లు అమలు చేస్తూ పార్లమెంట్లో తీర్మానం చేసి బీసీలకు 27% శాతం రిజర్వేషన్ అమలు చేయడం జరిగిందని గుర్తు చేశారు.ఇప్పటివరకు మన బీసీలు రిజర్వేషన్లు అనుభవిస్తున్నామంటే బీపీ మండల్ కృషి ,బిపి సంఘం కృషి ఎంతగానో ఉన్నదని కొనియాడారు.అప్పుడు బీపీ మండల్ సిఫార్సులను వ్యతిరేకించిన బిజెపి పార్టీ ఈరోజు బీసీల పైన కపట ప్రేమను నటిస్తూ ఉండడం బీసీ లందరూ గమనిస్తున్నారని,బీసీలపైన చిత్తశుద్ధి ఉంటే బీజేపీ ప్రభుత్వం ఇప్పటికైనా మండల్ సిఫార్సులను అమలు చేయాలని డిమాండ్ చేయడం జరుగుతుందని తెలిపారు. కేంద్రంలో ప్రభుత్వంలో ఉన్న బిజెపి ప్రభుత్వం ఇప్పటికైనా బీసీలకు 50 శాతం విద్య, ఉద్యోగ,రాజకీయ రంగాలలో రిజర్వేషన్లను కల్పించి వారి చిత్తశుద్ధిని నిరూపించుకోవాల్సిందిగా కోరడమైందని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బీసీ జేఏసీ జిల్లా నాయకులు గజ్జెల్లి వెంకటయ్య,అర్కాల రాజన్న,వేముల కిరణ్, వేముల అశోక్,బీసీ యువజన నాయకులు పెద్దల చంద్రకాంత్,ఎండీ లతీఫ్ తదితరులు పాల్గొన్నారు