బెల్లంపల్లి, ఎస్బిఐ బ్యాంకు ద్వారా 12 మహిళా సంఘాలకు1.50 కోట్ల రుణాలు మంజూరు
పొదుపు సంఘాల
మహిళలు రుణాలను సద్వినియోగం చేసుకొని, ఆర్థికంగా ఎదిగి కుటుంబాలకు బాసటగా నిలవాలని మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరావు తెలిపారు. బెల్లంపల్లి మున్సిపాలిటీలో 100 రోజుల ప్రణాళికలో భాగంగా ఎస్బిఐ,లో 12 మహిళా సంఘాలకు రూ.1.50 కోట్ల విలువైన రుణాలు మంజూరు చేసి వారికి అందజేశారు. మహిళా అభివృద్ధికి చేయూతను అందిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్బిఐ మేనేజర్ మున్సిపల్ మున్సిపాలిటీ సిబ్బంది, మహిళా సంఘాల సభ్యులు తదితరులు ఉన్నారు.