Praja Telangana
తెలంగాణ

భూములు లాక్కుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగుతున్న అటవీశాఖ దాడులు*

భూములు లాక్కుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగుతున్న అటవీశాఖ దాడులు*

బిజెపి రాష్ట్ర నేత కొయ్యల ఏమాజి ఫైర్

కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చాక నిరుపేద రైతులపై అటవీశాఖ దాడులు పెరిగాయని, వారి భూములను ప్రభుత్వం లాక్కుంటున్నదని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, న్యాయవాది కొయ్యల ఏమాజి విమర్శించారు. నెన్నెల మండలంలోని ఖర్జీ, జంగాలపేట, దమ్మిరెడ్డిపేట, కొత్తగూడ గ్రామాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా రైతులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఏమాజి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నిరుపేద రైతుల భూములను లక్ష్యంగా చేసుకొని ఆక్రమించడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదాని అన్నారు. ప్రజల ఓట్లతో ఎంఎల్ఏ అయిన గడ్డం వినోద్ రైతుల గోడు పట్టించుకోవడం లేదన్నారు. ఆయన హైదరాబాద్ లో ఏసి లకే పరిమితం అయ్యాడని విమర్శించారు. రైతులు అరవై ఏళ్లుగా సాగు చేస్తున్న భూములను అటవీశాఖ అధికారులు దాడులు చేస్తే పరిణామాలు తీవ్రoగా ఉంటాయని హెచ్చరించారు. రాష్ట మంత్రి సీతక్క ఇటీవల నిర్వహించిన సమావేశంలో అటవీశాఖ అధికారులు రైతుల జోలికి పోవద్దని హెచ్చరించినా వారి బుద్ధి మారడం లేదన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా కార్యదర్శి గోవర్ధన్, మండల అధ్యక్షులు శేఖర్, సీనియర్ నాయకులు అజ్మీరా శ్రీనివాస్, పట్టణ ప్రధాన కార్యదర్శి అరవింద్, రైతులు మొండయ్య గౌడ్, సతీష్, మధుకర్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

మోడీ క్యాంటీన్ ఆధ్వర్యంలో అల్పాహార పంపిణీ

BSNL శుభవార్త: సిమ్ డోర్ డెలివరీ

Share this