Praja Telangana
తెలంగాణ

రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, మహిళా-శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ (సీతక్క)*

*ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలు అర్హత గల ప్రతి ఒక్కరికి అందేలా చర్యలు*

*రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, మహిళా-శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ (సీతక్క)*

ప్రజా సంక్షేమంలో భాగంగా ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు ఫలాలు అర్హత గల ప్రతి ఒక్కరికి అందేలా అధికార యంత్రాంగం సమిష్టిగా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, మహిళా-శిశు సంక్షేమ శాఖ మంత్రి, జిల్లా ఇన్చార్జ్ మంత్రి ధనసరి అనసూయ (సీతక్క) అన్నారు. శనివారం మంచిర్యాల జిల్లా నస్పూర్ లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సమావేశ మందిరంలో మంచిర్యాల, కుమ్రంభీం ఆసిఫాబాద్, ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల కలెక్టర్లు కుమార్ దీపక్, వెంకటేష్ దోత్రే, రాజర్షి షా, అభిలాష అభినవ్, సమగ్ర గిరిజన అభివృద్ధి సంస్థ ఉట్నూర్ ప్రాజెక్టు అధికారి ఖుష్బూ గుప్తా, శాసనమండలి సభ్యులు మల్క కొమురయ్య, దండే విఠల్, మంచిర్యాల, బెల్లంపల్లి, ముథోల్ నియోజకవర్గాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు, గడ్డం వినోద్, రామారావు పటేల్, జి.సి.సి. చైర్మన్ కొట్నాక తిరుపతి లతో కలిసి ఉమ్మడి జిల్లా అదనపు కలెక్టర్లు, రెవెన్యూ, వ్యవసాయ, గృహ నిర్మాణ శాఖల అధికారులతో భూభారతి, ఇందిరమ్మ ఇండ్లు, యాసంగి వరి ధాన్యం సేకరణ, ఖరీఫ్ సాగు సన్నద్ధం అంశాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి, జిల్లా ఇన్చార్జ్ మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. యాసంగి వరి ధాన్యం సేకరణ కొరకు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి వరి ధాన్యం సేకరించడం జరుగుతుందని, ధాన్యం సేకరణ ప్రక్రియ చివరి దశకు చేరుతుందని తెలిపారు. తడిసిన ధాన్యాన్ని నిబంధనల ప్రకారం కొనుగోలు చేస్తామని, రైతులు ఆందోళన చెందవలసిన అవసరం లేదని తెలిపారు. భూసమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం చేపట్టిన భూభారతి నూతన ఆర్. ఓ. ఆర్. చట్టం- 2025లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా మొదటి విడతలో 4 జిల్లాలో 4 మండలాలను పైలెట్ మండలాలుగా ఎంపిక చేసి దరఖాస్తులు స్వీకరించి సంబంధిత సమస్యలను జూన్ 2వ తేదీలోగా పరిష్కరించడం జరుగుతుందని తెలిపారు. 2వ విడతలో జిల్లాకు ఒక మండలం చొప్పున ఎంపిక చేసి దరఖాస్తులు స్వీకరించడం జరిగిందని తెలిపారు. జూన్ 3వ తేదీ నుండి 20వ తేదీ వరకు అన్ని మండలాలలో రెవెన్యూ సదస్సులు నిర్వహించి భూ సమస్యలపై దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుందని, ధరణి స్థానంలో తీసుకువచ్చిన భూ భారతి చట్టం. రైతులకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని తెలిపారు. రైతులు తమ భూములను స్వేచ్ఛగా సాగు చేసుకునేలా ఎలాంటి వివాదాలు లేకుండా భూభారతి చట్టాన్ని రూపొందించడం జరిగిందని తెలిపారు. నియోజకవర్గానికి 3 వేల 500 చొప్పున రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలకు 4 లక్షల 50 వేల ఇందిరమ్మ ఇండ్లు కేటాయించడం జరిగిందని తెలిపారు. అత్యంత పేదవారికి జాబితాలో చోటు కల్పించడం జరుగుతుందని, సమగ్ర గిరిజన అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో పి.వి.టి.జి.లు, ఇతర ఆదివాసీలకు 5 వేల ఇందిరమ్మ ఇండ్లు ప్రత్యేకంగా కేటాయించడం జరిగిందని తెలిపారు. ఖరీఫ్- 2025 సాగుకు వ్యవసాయ శాఖ సన్నద్ధం కావాలని, నైరుతి రుతుపవనాలు వస్తున్నందున విత్తనాలు, ఎరువులు అవసరమైన మేరకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని, అధిక ధరలకు విక్రయిస్తూ, కృత్రిమ కొరత సృష్టించే వారిపై, నకిలీ / నిషేధిత విత్తనాలు, ఎరువులు విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని తెలిపారు. వరద ప్రభావిత ప్రాంతాలలో ప్రకృతి వైపరీత్య నియంత్రణ కమిటీలను ఏర్పాటు చేసి తగు చర్యలు తీసుకోవాలని, నీటిపారుదల, వైద్య-ఆరోగ్య, వ్యవసాయ శాఖలు, సంబంధిత శాఖలతో సమావేశాలు ఏర్పాటు చేసుకొని చేపట్టిన కార్యక్రమాలపై కార్యచరణ రూపొందించుకోవాలని తెలిపారు. జూన్ 12న విద్యా సంవత్సరం ప్రారంభమవుతున్న దృష్ట్యా పాఠశాలలు, వసతిగృహాలు సిద్ధం చేయాలని తెలిపారు. అంగన్వాడీ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి సారించి కౌమార దశ పిల్లల కొరకు పౌష్టికాహారం కొరకు చిక్కీలను ఇవ్వడం జరుగుతుందని, అంగన్వాడీ టీచర్లకు 2 లక్షల రూపాయల రిటైర్మెంట్ బెన్ఫిట్స్, వేసవి సెలవులు ఇవ్వడం జరుగుతుందని, జీతాల పెంపుదల అంశంపై ప్రభుత్వం ఆలోచిస్తుందని, 35 వేల 700 అంగన్వాడీ కేంద్రాలను ప్రి-ప్రైమరీ పాఠశాలలుగా మార్చడం జరిగిందని, 50 రకాల ఆట వస్తువులు అందించడం జరిగిందని, టీచర్లు, సిబ్బంది బాధ్యతగా విధులు నిర్వహించి దేశంలోనే రాష్ట్రం ముందంజలో ఉండేలా కృషి చేయాలని

తెలిపారు.

జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ మాట్లాడుతూ ఏప్రిల్ 14వ తేదీన ప్రభుత్వం ప్రతిష్టాత్మంగా ప్రవేశపెట్టిన భూభారతి చట్టం-2025లో భాగంగా పైలెట్ మండలంగా జిల్లాలోని భీమారం మండలం ఎంపిక చేయడం జరిగిందని, ఈ క్రమంలో భీమారం మండలంలోని 12 గ్రామపంచాయతీలలో 28 మంది సిబ్బందితో 4 బృందాలను నియమించి భూసమస్యలపై దరఖాస్తులు స్వీకరించడం జరిగిందని తెలిపారు. ఒక ప్రత్యేక సర్వే బృందంతో రెవెన్యూ, అటవీ శాఖల మధ్య నెలకొన్న సమస్యల పరిష్కారం కోసం చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. 2 వేల 148 దరఖాస్తులు రాగా 1 వేయి 10 సాదాబైనామాపై అందాయని, న్యాయస్థానంలో కేసులు కొనసాగుతున్నందున తీర్పు అనంతరం పరిష్కరించడం జరుగుతుందని తెలిపారు. మిగిలిన 1 వేయి 138 దరఖాస్తులలో 741 ఇప్పటి వరకు పరిష్కరించడం జరిగిందని, మిగిలిన వాటిని జూన్ 5వ తేదీ లోగా పరిష్కరిస్తామని తెలిపారు. మిగిలిన మండలాలలో జూన్ 3వ తేదీ నుండి 20వ తేదీ వరకు రెవెన్యూ సదస్సులు నిర్వహించేందుకు మండలానికి 2 బృందాల చొప్పున ఏర్పాటు చేసి దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుందని తెలిపారు. ఇందిరమ్మ ఇండ్ల మొదటి విడతలో 2 వేల ఇండ్లు మంజూరు కాగా 991 ఇండ్లు గ్రౌండ్ ప్రక్రియ పూర్తయ్యాయని, నిర్మాణ దశను బట్టి బిల్లులు మంజూరు చేయడం జరుగుతుందని తెలిపారు. గత సంవత్సరం ఈ సమయానికి 1 లక్షా 35 వేల మెట్రిక్ టన్నుల వరిధాన్యం కొనుగోలు చేయగా ఈసారి 1 లక్షా 77 వేల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేశామని. తెలిపారు. గతంలో పోల్చితే ఈసారి 1.5 / 2 రెట్లు అధికంగా కొనుగోలు చేయడం జరిగిందని తెలిపారు. ఫిబ్రవరిలో ప్రత్యేక సమావేశం నిర్వహించి జిల్లాలో నకిలీ / నిషేధిత విత్తనాలు, ఎరువుల రవాణా, విక్రయంపై చర్యలు చేపట్టామని, ఇప్పటి వరకు 34 మందిని అరెస్టు కాగా 871 కిలోల నకిలీ / నిషేధిత విత్తనాలను స్వాధీనపర్చుకోవడం జరిగిందని తెలిపారు. జిల్లా సరిహద్దులో అంతర్గత చెకోపోస్టులను ఏర్పాటు చేసి విస్తృత స్థాయి తనిఖీలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు,

అనంతరం కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని కిశోర బాలికల కొరకు ఇందిరమ్మ అమృతం పథకం క్రింద పల్లీలు, చిరుధాన్యాలతో తయారుచేసిన చిక్కీల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు,

ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ సబావత్ మోతిలాల్, జిల్లా అటవీ అధికారి శివ్ అశిష్ సింగ్, పంచాయతీరాజ్, గృహ

నిర్మాణ, పౌరసరఫరాలు, వ్యవసాయ శాఖల అధికారులు సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Related posts

బ్యాంకు ల ఆధ్వర్యంలో షేడ్ వేయండి. పార్కింగ్ కల్పించండీ.

Chief Editor: Satish Kumar

ఎంబీసీ డిఎన్టి ల న్యాయబరమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి

Chief Editor: Satish Kumar

జబ్బలు సరిసిందెవరు …బొమ్మ గడియారాలు ఇచ్చింది ఎవరు…!కల్లూరు సభలో స్థానిక నేతలపై కేసీఆర్ వ్యంగ్యాస్త్రాలు

Share this