*కాలేశ్వరం సరస్వతి పుష్కరాలలో పాల్గొన్న బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్*
భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వర ముక్తేశ్వర క్షేత్రంలోని త్రివేణి సంగమం వద్ద సరస్వతి పుష్కర మహోత్సవ కార్యక్రమంలో పాల్గొని గోదావరి, ప్రాణహిత నదుల అంతర్వాహిని సరస్వతీ నదిలో పుణ్య స్నానాలు ఆచరించి దేవి మహా సరస్వతి అమ్మ వారి ప్రత్యేక పూజలలో పాల్గొన్న బెల్లంపల్లి ఎమ్మెల్యే, గడ్డం వినోద్, ఆయన మాట్లాడుతూ బెల్లంపల్లి నియోజకవర్గ ప్రజలు భారతదేశ ప్రజలు అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, అమ్మవారిని కోరుతున్నానని ఈ సందర్భంగా వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.