October 29, 2026
Praja Telangana
తెలంగాణ

*మంచినీరు, విద్యుత్‌ వృథాను అరికట్టాలి.. పొదుపులో ప్రజలు భాగస్వాములు కావాలి: క్యాతనపల్లి మున్సిపాలిటీ*

రామకృష్ణాపూర్,అక్టోబర్ 29(నేటి ప్రజా తెలంగాణ):ఎల్‌నినో ప్రభావంతో భూగర్భ జలాలు తగ్గి భవిష్యత్తులో మంచినీటి కొరత ఏర్పడే అవకాశాల నేపథ్యంలో నీరు, విద్యుత్‌ను పొదుపుగా వినియోగించాలని క్యాతనపల్లి మున్సిపాలిటీ ప్రజలకు విజ్ఞప్తి చేసింది. ప్రభుత్వ ఆదేశాలు, మంచిర్యాల జిల్లా కలెక్టర్‌ సూచనల మేరకు మంచినీటి వృథాను అరికట్టడంతో పాటు విద్యుత్‌ పొదుపు చర్యలు చేపట్టాలని మున్సిపల్‌ కమిషనర్‌ కోరారు.ఇళ్లలో, ప్రభుత్వ కార్యాలయాల్లో నీటి కుళాయిలను అవసరం లేకుండా తెరిచి ఉంచరాదని, అవసరమైనంత నీటిని వినియోగించుకున్న వెంటనే కుళాయిలను మూసివేయాలని సూచించారు. నీటి పైపులైన్లు, కుళాయిలు, నీటి ట్యాంకుల వద్ద లీకేజీలు కనిపిస్తే వెంటనే మున్సిపల్‌ కార్యాలయానికి సమాచారం అందించాలని తెలిపారు. నీటి సరఫరా కేంద్రాల వద్ద నీరు వృథా కాకుండా చర్యలు తీసుకోవాలని, బోరుబావుల మోటార్లను అవసరమైనంత సమయం మాత్రమే నడిపి, వినియోగం పూర్తయిన వెంటనే నిలిపివేయాలని సూచించారు. వార్డు అధికారులు నీటి వృథాను గుర్తించిన వెంటనే సంబంధిత సిబ్బందికి సమాచారం అందించి నివారణ చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు.విద్యుత్‌ పొదుపులోనూ ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని మున్సిపాలిటీ కోరింది. ప్రభుత్వ కార్యాలయాల్లో పనివేళలు ముగిసిన వెంటనే విద్యుత్‌ దీపాలు, ఫ్యాన్లు, ఏసీలు, ఇతర విద్యుత్‌ పరికరాలను నిలిపివేయాలని సూచించింది. పగటిపూట సహజ వెలుతురు అందుబాటులో ఉన్నప్పుడు అనవసరంగా విద్యుత్‌ దీపాలను వినియోగించరాదని, విద్యుత్‌ వృథా జరుగుతున్నట్లు గుర్తిస్తే వెంటనే సంబంధిత అధికారులకు తెలియజేయాలని తెలిపింది.నీరు, విద్యుత్‌ వంటి విలువైన వనరులను కాపాడుకోవడం ప్రతి పౌరుడి బాధ్యతని, ప్రజలందరూ తమ ఇళ్ల నుంచే పొదుపు చర్యలను ప్రారంభించి భావితరాలకు సహజ వనరులను అందించేందుకు సహకరించాలని మున్సిపల్‌ కమిషనర్‌ విజ్ఞప్తి చేశారు. “విద్యుత్‌ను ఆదా చేద్దాం – మంచినీటిని సంరక్షిద్దాం – భావితరాలకు సహజ వనరులను అందిద్దాం” అనే సందేశంతో క్యాతనపల్లి ప్రజలందరూ నీరు, విద్యుత్‌ పొదుపులో భాగస్వాములు కావాలని కోరారు.నీటి వృథా నివారణ, లీకేజీల సమాచారం, ఇతర వివరాల కోసం మున్సిపల్‌ అధికారి జి. ఆశ్రిత్‌, ఎం.ఏ.ఈ. (8555848006)ను సంప్రదించవచ్చు. నీటి సరఫరా విభాగానికి చెందిన మాతంగి రవి (9963538461), ఏ. వెంకటి (9989167681), విద్యుత్‌ విభాగానికి చెందిన బంటు నారాయణ (9391640311), డి. విజయ్‌ (9063322197)లను కూడా సంప్రదించాలని మున్సిపాలిటీ సూచించింది.

Related posts

*వ్యాక్సినేషన్, ఆరోగ్య సేవల అమలులో నిర్లక్ష్యం వద్దు: డీఎంహెచ్ఓ డాక్టర్ నరేందర్ రాథోడ్*

ఘనంగా మేయర్, డిప్యూటీ మేయర్, కార్పొరేటర్ల ప్రమాణ స్వీకారం

Chief Editor: Satish Kumar

మోడిని బలపర్చండి – దేశాన్ని కాపాడండి

Share this