October 28, 2026
Praja Telangana
తెలంగాణ

*సీనియర్ కెమెరామెన్ పులిపాక శ్రీనివాస్ మృతి.. పాత్రికేయ లోకంలో విషాదం*

రామకృష్ణాపూర్,అక్టోబర్ 28(నేటి ప్రజా తెలంగాణ):మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్ పట్టణంలోని తిలక్ నగర్‌కు చెందిన సీనియర్ కెమెరామెన్ పులిపాక శ్రీనివాస్ అనారోగ్యంతో బుధవారం తెల్లవారుజామున కన్నుమూశారు. ఆయన మృతి పట్ల పాత్రికేయులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.ఉమ్మడి ఆదిలాబాద్ ప్రాంతంతో పాటు మంచిర్యాల జిల్లా కేంద్రంలో వివిధ ఎలక్ట్రానిక్ మీడియా సంస్థల్లో సుమారు 20 ఏళ్లుగా కెమెరామెన్‌గా సేవలందించిన శ్రీనివాస్ జర్నలిజం రంగంలో తనదైన గుర్తింపు సంపాదించుకున్నారు. వార్తా సేకరణలో తన కెమెరా నైపుణ్యంతో ఎన్నో ఏళ్లుగా సేవలందించిన ఆయన మరణం మీడియా రంగానికి తీరని లోటుగా పలువురు పేర్కొన్నారు.శ్రీనివాస్ పార్థివదేహానికి తాజా మాజీ ఎస్సీ, ఎస్టీ కమిషన్ సభ్యుడు రేణిగుంట్ల ప్రవీణ్, రవీంద్రఖని ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు దుస్సా శివప్రసాద్, సాక్షి దినపత్రిక సీనియర్ పాత్రికేయుడు పొన్నాల సుమన్, వి6 వెలుగు దినపత్రిక సీనియర్ పాత్రికేయుడు భావండ్లపల్లి శ్రీనివాస్, సీనియర్ వీడియో జర్నలిస్ట్ సారయ్యతో పాటు స్థానిక పాత్రికేయులు ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా ఆయనతో తమకున్న అనుబంధాన్ని, వృత్తిపరంగా అందించిన సేవలను గుర్తుచేసుకున్నారు. శ్రీనివాస్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.

Related posts

కలెక్టర్ కార్యాలయంలో అదిలాబాద్ జిల్లా స్థాయి సమావేశం

*శాంతిఖనిలో బాలికపై లైంగిక దాడి.. నిందితుడు అరెస్ట్, రిమాండ్*

ముగిసిన మంచిర్యాల కార్పొరేషన్ల ప్రమాణ స్వీకారాల కార్యక్రమం

Share this