October 28, 2026
Praja Telangana
తెలంగాణ

*రాళ్లవాగు వంతెన పనులతో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రత్యామ్నాయ మార్గం ఏర్పాటు చేయాలి*

మంచిర్యాల,అక్టోబర్ 22(నేటి ప్రజా తెలంగాణ):మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని రాళ్లవాగు వంతెన నిర్మాణ పనులను మంచిర్యాల శాసనసభ్యుడు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు సంబంధిత అధికారులతో కలిసి పరిశీలించారు. వంతెన నిర్మాణ పనులు కొనసాగుతున్న సమయంలో ప్రజలకు, వాహనదారులకు రాకపోకల్లో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తాత్కాలికంగా మట్టి రహదారిని ఏర్పాటు చేయాలని రహదారులు, భవనాల శాఖ అధికారులతో పాటు మున్సిపల్ అధికారులను ఆదేశించారు.వంతెన నిర్మాణ పనులు పూర్తయ్యే వరకు ప్రజల రాకపోకలకు ఆటంకాలు కలగకుండా ప్రత్యామ్నాయ మార్గాన్ని అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. ప్రజల సౌకర్యానికి ప్రాధాన్యతనిస్తూ నిర్మాణ పనుల సమయంలో అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులకు స్పష్టం చేశారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడటంతో పాటు వారి సమస్యలను పరిష్కరించేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఎమ్మెల్యే సూచించారు.ఈ కార్యక్రమంలో మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ధర్ని మధుకర్, కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, కార్పొరేటర్ తూముల నరేష్, మంచిర్యాల జిల్లా రాజీవ్ గాంధీ పంచాయతీ రాజ్ సంఘటన్ అధ్యక్షుడు గడ్డం త్రిమూర్తి, సంబంధిత అధికారులు, కార్పొరేటర్లు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Related posts

*క్షయ వ్యాధిగ్రస్తులకు పోషకాహార కిట్లు పంపిణీ.. వైద్య సేవలను మరింత మెరుగుపరచాలి: డీఎంహెచ్‌వో డాక్టర్ నరేందర్ రాథోడ్*

రైతులకు మేయర్ సూచనలు — సన్న వడ్ల సాగుకు ప్రాధాన్యం

*నవజాత శిశువు మృతి కేసులో ముగ్గురు అరెస్ట్*

Share this