October 3, 2026
Praja Telangana
తెలంగాణ

*ప్రజా సమస్యల పరిష్కారానికి విలేకరులు కృషి చేయాలి: రవీంద్రఖని ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు దుస్స శివప్రసాద్*

రామకృష్ణాపూర్, సెప్టెంబర్ 18(నేటి ప్రజా తెలంగాణ): ప్రజా సమస్యలను గుర్తించి వాటిని వెలుగులోకి తీసుకురావడంలో విలేకరులు కీలక పాత్ర పోషించాలని రవీంద్రఖని ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు దుస్స శివప్రసాద్ అన్నారు. శుక్రవారం రామకృష్ణాపూర్ పట్టణంలోని ప్రెస్ క్లబ్ కార్యాలయంలో నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజల సమస్యలను వార్తల రూపంలో అధికారుల దృష్టికి తీసుకెళ్లడం ద్వారా వాటి పరిష్కారానికి మార్గం ఏర్పడుతుందని తెలిపారు. విలేకరులు వృత్తి నిబద్ధతతో పనిచేస్తూ ప్రెస్ క్లబ్ నియమ నిబంధనలను పాటించాలని సూచించారు.ఈ సమావేశంలో పలు పత్రికల్లో పనిచేస్తున్న పలువురు విలేకరులు ప్రెస్ క్లబ్‌లో చేరగా, వారికి స్వాగతం పలికారు. అనంతరం క్లబ్ కార్యవర్గాన్ని విస్తరిస్తూ ఉపాధ్యక్షులుగా మామిడాల రవి, రామిడి సాయి సృజన్, ఆర్గనైజింగ్ సెక్రటరీగా దండు సదానందం, జాయింట్ సెక్రటరీలుగా కందుల ప్రవీణ్, అప్పని కిరణ్‌లను ఎన్నుకున్నారు. నూతన బాధ్యతలు చేపట్టినవారు సభ్యులతో సమన్వయంతో పనిచేస్తూ క్లబ్ అభివృద్ధికి కృషి చేయాలని శివప్రసాద్ కోరారు.ఈ కార్యక్రమంలో వర్కింగ్ ప్రెసిడెంట్ రామిల్ల శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి పోలు దాసరి శ్రీనివాస్, కోశాధికారి పరికిపండ్ల రాజు, తూముల భవిష్యత్, నరేడ్ల వెంకన్న, కరెడ్ల రఘు, బొద్దుల భీమయ్య, కోల శ్రీనివాస్, బత్తుల సతీష్, నందు, సాయిని తిరుపతి పాల్గొన్నారు.

Related posts

*హెపటైటిస్ నివారణకు అప్రమత్తతే రక్షణ.. ప్రపంచ హైపటైటిస్ దినోత్సవం సందర్భంగా ప్రజలకు అవగాహన ర్యాలీ*

Chief Editor: Satish Kumar

*లక్ష్య సాధనకు సంకల్పం.. క్రమశిక్షణే కీలకం*

*ప్రజావాణిలో ఫిర్యాదుల స్వీకరణ.. పరిష్కారానికి సీపీ ఆదేశాలు *

Share this