October 3, 2026
Praja Telangana
తెలంగాణ

*తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట చరిత్రను పాఠ్యాంశంలో చేర్చాలి*

రామకృష్ణాపూర్, సెప్టెంబర్ 16 (నేటి ప్రజా తెలంగాణ): తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వార్షికోత్సవాల సందర్భంగా రామకృష్ణాపూర్ సూపర్ బజార్‌లో ఏఐటీయూసీ నూతన కార్యాలయాన్ని ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య ప్రారంభించారు. అనంతరం యూనియన్ జెండాను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా సీపీఐ జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్ మాట్లాడుతూ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట చరిత్రను పాలకులు విస్మరించడం అన్యాయమని అన్నారు. నిజాం నిరంకుశ పాలన, భూస్వామ్య దోపిడీకి వ్యతిరేకంగా వేలాది మంది రైతులు, కూలీలు, మహిళలు, సామాన్య ప్రజలు సాగించిన పోరాటం తెలంగాణ చరిత్రలో మహత్తర అధ్యాయమని తెలిపారు. రైతులకు భూమి, వెట్టిచాకిరీ నిర్మూలన, సామాజిక న్యాయం కోసం కమ్యూనిస్టుల నాయకత్వంలో సాగిన పోరాటంలో అనేక మంది ప్రాణత్యాగాలు చేశారని పేర్కొన్నారు.ఈ చారిత్రక పోరాటాన్ని భావితరాలకు అందించేలా పాఠ్యాంశాల్లో చేర్చాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించే ప్రయత్నాలను ప్రజలు తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. ఈ పోరాటంలో తమ పాత్ర ఏమిటో, పోరాడిన వీరులు ఎవరో బీజేపీ నాయకులు తెలంగాణ ప్రజలకు స్పష్టంగా వివరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు ఇప్పకాయల లింగయ్య, బీమనాడుని సుదర్శన్, మిట్టపెల్లి శ్రీనివాస్, జిల్లా సమితి సభ్యులు మామిడి గోపి, ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు ఎండీ అక్బర్ అలీ, మందమర్రి శాఖ కార్యదర్శి సేలంద్ర సత్యనారాయణ, ఏఐటీయూసీ నాయకులు రమణ, హరి, మండల్ శ్రీనివాస్, కౌన్సిలర్లు కౌడగాని సాంబయ్య, మద్దెల శంకర్, మాదాసు శంకర్, ఎండీ షాకీర్, గజ్జి రమేష్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

*ప్రస్తుత భారీ వర్షాల కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: మంత్రి వివేక్ వెంకటస్వామి*

Chief Editor: Satish Kumar

తెలంగాణ సచివాలయ సందర్శన లోప్రపంచ ముద్దుగుమ్మలు*

Share this