September 12, 2026
Praja Telangana
తెలంగాణ

*వినాయక మండపాల ఏర్పాటుకు పోలీసులకు సమాచారం తప్పనిసరి: ఎస్ఐ జె. శ్రీధర్*

రామకృష్ణాపూర్, సెప్టెంబరు 11 (నేటి ప్రజా తెలంగాణ):
వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో వినాయక మండపాల ఏర్పాటు, విగ్రహాల ప్రతిష్ఠాపన, నిమజ్జన కార్యక్రమాలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పాటించాల్సిన నిబంధనలపై అవగాహన కల్పించేందుకు శుక్రవారం రామకృష్ణాపూర్ సింగరేణి ఆర్కే సీఏఓ క్లబ్‌లో శాంతి కమిటీ సమావేశం ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా ఎస్ఐ శ్రీధర్ మాట్లాడుతూ వినాయక మండపాలను ఏర్పాటు చేసి ఉత్సవాలు నిర్వహించాలనుకునే నిర్వాహకులు తప్పనిసరిగా పోలీస్ శాఖకు సమాచారం అందించాలని సూచించారు. మండపాల ఏర్పాటుకు సంబంధించిన పూర్తి వివరాలను పోలీస్ శాఖ ఆన్‌లైన్ పోర్టల్‌లో నమోదు చేయాలని తెలిపారు. ఇందుకోసం https://policeportal.tspolice.gov.in వెబ్‌సైట్‌ను సందర్శించి దరఖాస్తుదారుని వివరాలు, విగ్రహం ఏర్పాటు చేసే ప్రదేశం, సంబంధిత పోలీస్ స్టేషన్ పరిధి, విగ్రహం ఎత్తు, మండపం ఎత్తు, ఉత్సవ కమిటీ సభ్యుల పేర్లు, ఫోన్ నంబర్లు నమోదు చేయాలని సూచించారు.విగ్రహ ప్రతిష్ఠాపన తేదీ, నిమజ్జనం తేదీ, సమయం, నిమజ్జనం చేసే ప్రదేశం, నిమజ్జనానికి వినియోగించే వాహనం వివరాలను సైతం నమోదు చేయాలని తెలిపారు. మండప నిర్వాహకులు, గణపతి ఉత్సవ కమిటీ సభ్యులు, వాలంటీర్ల పేర్లు, ఫోన్ నంబర్లు, చిరునామాలను పూర్తిగా నమోదు చేయాలని సూచించారు. ఆన్‌లైన్‌లో వివరాలు నమోదు చేయడంలో ఇబ్బందులు ఎదురైతే రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్‌ను సంప్రదించాలని తెలిపారు.పర్యావరణ పరిరక్షణను దృష్టిలో ఉంచుకుని మట్టి వినాయక విగ్రహాల ఏర్పాటుకు ప్రాధాన్యం ఇవ్వాలని ఎస్ఐ శ్రీధర్ కోరారు. ఉత్సవాల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా పోలీస్ శాఖ నిబంధనలను పాటిస్తూ వేడుకలను నిర్వహించాలని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో వెంటనే డయల్‌ 100 లేదా 112కు సమాచారం అందించాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో కేతనపల్లి మున్సిపాలిటీ వైస్ చైర్మన్,చైర్‌పర్సన్ గోడిసెల సంధ్యారాణి, మున్సిపల్ కమిషనర్ మురళీకృష్ణ, శాంతి కమిటీ సభ్యులు, వినాయక ఉత్సవ కమిటీ నిర్వాహకులు, మండపాల నిర్వాహకులు, వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు.

Related posts

బెల్లంపల్లి ఆటో యూనియన్ నుండి అధిక సహాయం

*మంచిర్యాలలో యువతకు 45 రోజుల ఉచిత నైపుణ్య శిక్షణ*

*సర్వే ప్రక్రియ పకడ్బందీగా, పారదర్శకంగా నిర్వహించాలి: జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్*

Chief Editor: Satish Kumar
Share this