September 11, 2026
Praja Telangana
తెలంగాణ

*వినాయక మండపాల ఏర్పాటుకు పోలీసుల అనుమతి: పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝూ*

మంచిర్యాల,సెప్టెంబర్ 11(నేటి ప్రజా తెలంగాణ):వినాయక చవితి సందర్భంగా రామగుండము పోలీస్ కమిషనరేట్ పరిధి మంచిర్యాల జిల్లాల్లో వినాయక విగ్రహాలను ప్రతిష్ఠించి ఉత్సవాలు నిర్వహించాలనుకునే నిర్వాహకులు తప్పనిసరిగా పోలీస్ శాఖ అనుమతి పొందాలని పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా సూచించారు.మండపాల ఏర్పాటుకు సంబంధించిన పూర్తి వివరాలను పోలీస్ శాఖ వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్ ద్వారా నమోదు చేయాలని తెలిపారు. దరఖాస్తుదారుడి వివరాలు, విగ్రహం ఏర్పాటు చేసే ప్రదేశం, సంబంధిత పోలీస్ స్టేషన్, విగ్రహం ఎత్తు, మండపం ఎత్తు, ఉత్సవ కమిటీ సభ్యుల పేర్లు, ఫోన్ నంబర్లు, విగ్రహ ప్రతిష్ఠాపన తేదీ, నిమజ్జనం తేదీ, సమయం, ప్రదేశం, నిమజ్జనానికి వినియోగించే వాహనం వివరాలను నమోదు చేయాలని పేర్కొన్నారు.మండప నిర్వాహకులు, గణపతి ఉత్సవ కమిటీ సభ్యులు, వాలంటీర్ల పేర్లు, ఫోన్ నంబర్లు, చిరునామా తదితర వివరాలను సైతం పూర్తిగా నమోదు చేయాలని సూచించారు. పట్టణాలు, గ్రామాల్లో ఏర్పాటు చేసే ప్రతి గణపతి మండపం నిర్వాహకులు తప్పనిసరిగా ఆన్‌లైన్‌లో వివరాలు నమోదు చేయాలని తెలిపారు. నమోదు ప్రక్రియలో ఇబ్బందులు ఎదురైతే సమీప పోలీస్ స్టేషన్‌ను సంప్రదించాలని సూచించారు.పర్యావరణ పరిరక్షణను దృష్టిలో ఉంచుకుని మట్టి వినాయక విగ్రహాల ప్రతిష్ఠాపనకు ప్రాధాన్యత ఇవ్వాలని కమిషనర్ కోరారు. ఎలాంటి అత్యవసర పరిస్థితి ఎదురైనా పోలీస్ యంత్రాంగం 24 గంటలు అందుబాటులో ఉంటుందని తెలిపారు. అత్యవసర సమయంలో వెంటనే డయల్ 112కు సమాచారం అందించాలని సూచించారు.వినాయక మండపాల నిర్వాహకులు పోలీస్ శాఖ సూచనలు, నిబంధనలకు లోబడి ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా కోరారు.

Related posts

చట్టవ్యతిరేక కార్యకలాపాలపై ఉక్కుపాదం__ ఇతర రాష్ట్రాల కార్మికుల వివరాలు నమోదు తప్పనిసరి : మంచిర్యాల డీసీపీ ఏ.భాస్కర్

మంచిర్యాల‌ జిల్లాలో 17.4 మిల్లీమీటర్ల వర్షపాతం

ఆకస్మిక తనిఖీతో అప్రమత్తం చేసిన మేయర్ దర్నీ మధుకర్

Share this