September 10, 2026
Praja Telangana
తెలంగాణ

*వెంకటాపూర్‌లో పీవీటీజీలకు మెరుగైన వైద్య సేవలు అందించాలి: అదనపు జిల్లా కలెక్టర్ పి.చంద్రయ్య*

కాసిపేట,సెప్టెంబరు 10(నేటి ప్రజా తెలంగాణ): మంచిర్యాల జిల్లా కేంద్రం కాసిపేట మండలం వెంకటాపూర్ ఆదివాసీ పీవీటీజీ గ్రామంలో ప్రధానమంత్రి జనజాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్‌ కార్యక్రమంలో భాగంగా నిర్మించిన బహుళ ప్రయోజన కేంద్రాన్ని అదనపు జిల్లా కలెక్టర్ చంద్రయ్య పరిశీలించారు.జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ నరేందర్ రాథోడ్‌తో కలిసి కేంద్రంలో కొనసాగుతున్న కార్యక్రమాలు, పీవీటీజీ కుటుంబాలకు అందుతున్న వైద్య సేవలను పరిశీలించారు.కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో గిరిజన సంక్షేమశాఖ, ఐటీడీఏ ఉట్నూర్ ద్వారా నిర్మించిన ఈ బహుళ ప్రయోజన కేంద్రాన్ని పీవీటీజీలకు అవసరమైన వైద్య సేవలు, పౌష్టికాహారం, సంక్షేమ పథకాలు అందించేందుకు వినియోగించాలని తెలిపారు. కేంద్రంలో ప్రాథమిక విద్యాభ్యాసానికి అవసరమైన ఏర్పాట్లు చేయడంతో పాటు తరచూ వైద్య శిబిరాలు నిర్వహించాలని సూచించారు.వైద్య ఆరోగ్య కార్యక్రమాలపై గ్రామస్తులకు అవగాహన కల్పించేలా పోస్టర్లు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. గ్రామంలో గర్భిణులు, బాలింతలకు అందుతున్న సేవలు, అంగన్‌వాడీ కార్యకర్తల విధులు, టీకాల కార్యక్రమం, పౌష్టికాహారం పంపిణీ, అసంక్రమణ వ్యాధుల పరీక్షల వివరాలను అదనపు జిల్లా కలెక్టర్ తెలుసుకున్నారు.గ్రామస్తులతో విద్యుత్, తాగునీరు, గృహాలు, పింఛన్లు, ఆరోగ్యం, విద్య, రహదారులు, చేయూత కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించారు. వ్యాధులు ప్రబలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై గ్రామస్తులకు అవగాహన కల్పించారు.పీవీటీజీలకు వైద్య సేవలు మరింత చేరువ చేసేందుకు వారానికి ఒకసారి మూడు గ్రామాలకు చెందిన ప్రజలతో వైద్య శిబిరం నిర్వహించాలని ఆదేశించారు. ప్రధానమంత్రి జనజాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్‌లో భాగంగా వైద్యులు, ఆరోగ్య సిబ్బంది గ్రామాలకు వెళ్లి సేవలు అందించాలని సూచించారు.మారుమూల ప్రాంతంలోని ఆదిమ గిరిజన కుటుంబాలకు అందుతున్న వైద్య సేవలపై అదనపు జిల్లా కలెక్టర్ సంతృప్తి వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ పంద్రం శంకర్, ఉప సర్పంచ్ ప్రసన్న, ఎంపీఓ సాజిద్ అలీ, ఎంపీడీఓ సత్యనారాయణ సింగ్, ఉప జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ సుధాకర్ నాయక్, వైద్యాధికారి డాక్టర్ దివ్య, జిల్లా మాస్ మీడియా అధికారి బుక్కా వెంకటేశ్వర్, పుట్ట సత్తయ్య, గ్రామపంచాయతీ కార్యదర్శి సునీత, ఆరోగ్య కార్యకర్తలు సుజాత, లక్ష్మి, ఆశ కార్యకర్తలు, ప్రధానమంత్రి జనజాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్‌కు సంబంధించిన వైద్య సిబ్బంది, వైద్యులు పాల్గొన్నారు.

Related posts

బెల్లంపల్లి, పట్టణంలో రోడ్డు పనులు పరిశీలించిన మున్సిపల్ కమిషనర్ తన్నీరు రమేష్

ఎల్ నినో’ ప్రభావం తీవ్రతరం – ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నిపుణుల హెచ్చరిక

“నమ్మకం మా బలం_ నాణ్యత మా లక్ష్యం” శ్రీ గుర్రాల శ్రీధర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు

Chief Editor: Satish Kumar
Share this