September 10, 2026
Praja Telangana
తెలంగాణ

*మాదకద్రవ్యాలకు దూరంగా ఉండి స్వేచ్ఛా జీవితాన్ని ఎంచుకోండి: డిఎంహెచ్ఓ డాక్టర్ నరేందర్ రాథోడ్*

మంచిర్యాల, సెప్టెంబర్ 1(నేటి ప్రజా తెలంగాణ): మంచిర్యాల అడ్వాన్స్‌డ్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ (ఐటీఐ)లో మంగళవారం విద్యార్థులకు మానసిక ఆరోగ్యం, మాదకద్రవ్యాల వినియోగం, డ్రగ్స్ అడిక్షన్ వల్ల కలిగే అనర్థాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ నరేందర్ రాథోడ్, ఐటీఐ ప్రిన్సిపల్ వెంకటేశ్వరరావు, వైస్ ప్రిన్సిపల్ సునీల్‌తో కలిసి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సుమారు 400 మంది ఐటీఐ విద్యార్థులకు మాదకద్రవ్యాల వల్ల కలిగే శారీరక, మానసిక, సామాజిక దుష్పరిణామాలపై అవగాహన కల్పించారు.డాక్టర్ నరేందర్ రాథోడ్ మాట్లాడుతూ మాదకద్రవ్యాలకు బానిస కాకుండా స్వేచ్ఛా జీవితాన్ని ఎంచుకోవాలని విద్యార్థులకు సూచించారు. మాదకద్రవ్యాలు ఆరోగ్యాన్ని మాత్రమే కాకుండా వ్యక్తి సామర్థ్యం, శక్తి, జ్ఞానం, కుటుంబ సంబంధాలు, భవిష్యత్తును కూడా దెబ్బతీస్తాయని తెలిపారు.డ్రగ్స్ వినియోగం క్రమంగా వ్యసనంగా మారి వ్యక్తి తనపై నియంత్రణ కోల్పోయే పరిస్థితి ఏర్పడుతుందని అన్నారు. దీర్ఘకాలంలో ఊపిరితిత్తులు, కాలేయం తదితర అవయవాలపై తీవ్ర ప్రభావం చూపే ప్రమాదం ఉందని హెచ్చరించారు. చట్టవిరుద్ధమైన మాదకద్రవ్యాల వినియోగం జీవితంలో చట్టపరమైన సమస్యలను కూడా తెచ్చిపెడుతుందని తెలిపారు.విద్యార్థులు చెడు స్నేహాలు, చెడు అలవాట్లు, ఎలాంటి ప్రలోభాలకు లోనుకాకుండా తమ లక్ష్యాలపై దృష్టి సారించాలని సూచించారు. మానసికంగా ఒత్తిడి, ఆందోళన లేదా ఇతర సమస్యలు ఎదురైతే నిపుణుల సహాయం తీసుకోవాలని తెలిపారు. ఉచిత మానసిక ఆరోగ్య కౌన్సిలింగ్ కోసం టెలీ-మనస్ 14416 సేవలను వినియోగించుకోవచ్చని వివరించారు.ఈ సందర్భంగా విద్యార్థులకు మోటివేషనల్ స్పీచ్ ఇచ్చి, మాదకద్రవ్యాల నిర్మూలన కోసం ప్రతిజ్ఞ చేయించారు. ఇలాంటి మానసిక ఆరోగ్యం, మాదకద్రవ్యాల నిర్మూలన అవగాహన కార్యక్రమాలను ప్రతి నెలా నిర్వహిస్తామని డీఎంహెచ్‌ఓ తెలిపారు.ఈ కార్యక్రమంలో ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ అనిల్, మానసిక ఆరోగ్య నిపుణులు డాక్టర్ సునీల్, జిల్లా మాస్ మీడియా అధికారి బుక్క వెంకటేశ్వర్, అల్లాడి శ్రీనివాస్, రషీద్, సీహెచ్‌వోలు నాందేవ్, కాకిరాల వెంకటేశ్వర్లు, శ్రీనివాస్, పున్నమయ్య, ఆప్తాలమిక్ అధికారి శంకర్, ఐటీఐ సిబ్బంది, లెక్చరర్లు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Related posts

*వర్షాకాల వ్యాధుల నివారణకు సమన్వయంతో పనిచేయాలి: డీఎంహెచ్‌వో డా. నరేందర్ రాథోడ్*

*ఆగస్టు 31న సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్ ప్రారంభం.. 49,104 మంది విద్యార్థులకు ప్రతిరోజూ పోషకాహార అల్పాహారం*

ఆకెనపల్లి ‘భూభారతి రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలి

Share this