September 11, 2026
Praja Telangana
తెలంగాణ

*యువత ఉద్యోగాలే లక్ష్యంగా కష్టపడాలి: మంత్రి వివేక్, ఎంపీ వంశీకృష్ణ*

చెన్నూరు,ఆగస్టు19 (నేటి ప్రజా తెలంగాణ): ప్రతిభ ఉన్న యువత ఆర్థిక పరిస్థితులను అడ్డంకిగా భావించకుండా అందుబాటులో ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకుని ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాలని రాష్ట్ర మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ పిలుపునిచ్చారు. కాకా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎస్‌ఐ, కానిస్టేబుల్ పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థుల కోసం చెన్నూరు పట్టణంలో ఏర్పాటు చేసిన కాకా ఫ్రీ కోచింగ్ సెంటర్‌ను వారు ప్రారంభించారు.ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్,డీసీపీ భాస్కర్ హాజరు కావడం జరిగింది.ఈ సందర్భంగా మంత్రి వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ.. ప్రతిభ కలిగిన యువతకు ఆర్థిక పరిస్థితులు అడ్డంకిగా మారకూడదనే ఉద్దేశంతో కాకా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత కోచింగ్ సెంటర్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. యువత ఈ అవకాశాన్ని పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకుని కష్టపడి చదివి ఉద్యోగాలు సాధించాలని సూచించారు. చెన్నూరు ప్రాంతం నుంచి అత్యధిక సంఖ్యలో ఎస్‌ఐ, కానిస్టేబుల్ అభ్యర్థులు ఎంపికై రాష్ట్రస్థాయిలో చెన్నూరుకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు ప్రైవేట్ రంగంలోనూ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం చర్యల తీసుకుంటోందని మంత్రి తెలిపారు. నైపుణ్యాభివృద్ధి, ప్రత్యేక శిక్షణ కార్యక్రమాల ద్వారా మరిన్ని ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తున్నామని పేర్కొన్నారు.ఎంపీ గడ్డం వంశీకృష్ణ మాట్లాడుతూ.. తెలంగాణ సాధనలో ప్రధానంగా నిలిచిన “నీళ్లు, నిధులు, నియామకాలు” లక్ష్యాలకు అనుగుణంగా యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడం ప్రభుత్వ బాధ్యత అన్నారు. యువతను రాజకీయంగా రెచ్చగొట్టడం కంటే వారి భవిష్యత్తుకు బాటలు వేయాల్సిన అవసరం ఉందన్నారు. యువతకు కేసులు కావాలా.. ఉద్యోగాలు కావాలా? అని ప్రశ్నిస్తూ, ప్రతి యువకుడు తన లక్ష్యాన్ని నిర్దేశించుకుని కష్టపడి చదివి మంచి ఉద్యోగం సాధించాలని సూచించారు.విpదేశీ భాషలు నేర్చుకుని అంతర్జాతీయ స్థాయిలో ఉద్యోగ అవకాశాలు పొందడాన్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. మంత్రి వివేక్ వెంకటస్వామి చొరవతో TOMCOM ద్వారా తెలంగాణ నిరుద్యోగ యువతకు విదేశాల్లోనూ ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.ప్రభుత్వం అవకాశాలు కల్పిస్తుందని, వాటిని అందిపుచ్చుకుని తమ జీవితాలను మార్చుకోవాల్సిన బాధ్యత యువతదేనని ఎంపీ స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో అధికారులు, కాకా ఫౌండేషన్ ప్రతినిధులు, ప్రజాప్రతినిధులు, యువత తదితరులు పాల్గొన్నారు.

Related posts

ఎండల వేళ దాహార్తిని తీర్చిన మహేష్ డాన్స్ అకాడమీ___డాక్టర్ స్వప్నిక,స్ఫూర్తి స్పాన్సర్ల సహకారంతో ఉచిత అంబలి పంపిణీ

*వార్తలతో బెదిరించి డబ్బులు డిమాండ్ చేశారన్న ఆరోపణలు.. ముగ్గురు విలేకరులపై కేసు నమోదు*

*యోగా సాధనతో సంపూర్ణ ఆరోగ్యం సాధ్యం.. ఆరోగ్యకరమైన జీవనశైలికి యోగా ఎంతో అవసరం : మేయర్ ధరణి మధుకర్*

Share this