మంచిర్యాల, ఆగస్టు 8: చేయూత సామాజిక భద్రత పింఛన్లకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఒక ప్రకటనలో తెలిపారు.వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, కల్లుగీత కార్మికులు, సికిల్ సెల్ బాధితులు, తలసేమియా, హీమోఫీలియా, బోదకాలు, డయాలసిస్ బాధితులు, చేనేత కార్మికులు పింఛన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు.అర్హులైన అభ్యర్థులు సంబంధిత మండల పరిషత్ అభివృద్ధి అధికారి (MPDO) కార్యాలయం లేదా మున్సిపల్ కార్యాలయంలో దరఖాస్తులు సమర్పించాలని సూచించారు.దరఖాస్తుతో పాటు ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఆదాయ ధ్రువీకరణ పత్రం, బ్యాంకు ఖాతా పుస్తకం, కుల ధ్రువీకరణ పత్రం, యూడీఐడీ/సదరం ధ్రువీకరణ పత్రం జత చేయాలని కలెక్టర్ సూచించారు.అర్హత కలిగిన ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని చేయూత సామాజిక భద్రత పింఛన్ కోసం దరఖాస్తు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ కోరారు.

