October 4, 2026
Praja Telangana
తెలంగాణ

*భట్రాజు యువజన సంఘం మంచిర్యాల జిల్లా కమిటీ ఏర్పాటు*

మంచిర్యాల,ఆగస్టు02: భట్రాజు యువజన సంఘం మంచిర్యాల జిల్లా కమిటీ ఏర్పాటు కార్యక్రమాన్ని మంచిర్యాల పట్టణంలోని కాలేజ్ రోడ్డులో గల నాలందా మోడల్ స్కూల్‌లో ఘనంగా నిర్వహించారు. సంఘ అధ్యక్షులు దేవరాజు సాయి కిరణ్ రాజు అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశానికి రాష్ట్ర యువజన అసోసియేట్ అధ్యక్షులు దేవరాజు ఆదర్శ్ వర్ధన్ రాజు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా దేవరాజు ఆదర్శ్ వర్ధన్ రాజు మాట్లాడుతూ భట్రాజు యువత ఐక్యంగా ఉంటూ సంఘ బలోపేతానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. విద్య, ఉపాధి అవకాశాలతో పాటు సామాజిక సేవా కార్యక్రమాల్లో యువత ముందుండి పనిచేయాలని సూచించారు. యువతలో ఐక్యత, నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తూ సమాజ అభివృద్ధికి తమ వంతు సహకారం అందించాలని అన్నారు.అనంతరం భట్రాజు యువజన సంఘం మంచిర్యాల జిల్లా కమిటీని ప్రకటించారు. జిల్లా అధ్యక్షులుగా దేవరాజు సాయి కిరణ్ రాజు, ఉపాధ్యక్షులుగా కశిపేట హరి హరన్, నీలకంఠం ప్రణయ్ కుమార్ రాజు, ప్రధాన కార్యదర్శిగా అడ్లూరి వరుణ్ రాజు, కార్యదర్శిగా తుమికి వెంకటేష్‌ను నియమించారు.క్రీడల విభాగంలో సందీప్ రాజు, కారంపూడి హర్ష వర్ధన్ రాజు, అక్కిరాజు శాంతన్ రాజు, ఆర్గనైజింగ్ కార్యదర్శిగా విలాసకవి సూర్యప్రకాశ్ రాజు, కోశాధికారిగా అంబటి దిలీప్ రాజును ఎంపిక చేశారు.ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులుగా అడ్లూరి జనక్ భరద్వాజ్, సంతోష్ రాజు దేవరాజు, సీహెచ్ వశిష్ఠ్, అడ్లూరి సాయి ప్రభాకర్ రాజును, సలహా కమిటీ సభ్యులుగా సీహెచ్ జీవన్ రాజు, చైతన్య రాజు, సనత్ రాజును ప్రకటించారు.కొత్తగా ఏర్పాటైన జిల్లా కమిటీ ఆధ్వర్యంలో భట్రాజు యువతను ఐక్యంగా ముందుకు తీసుకెళ్లడంతో పాటు విద్య, ఉపాధి, క్రీడలు, సామాజిక సేవా కార్యక్రమాలకు ప్రాధాన్యతనిస్తూ భవిష్యత్ కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో భట్రాజు రాష్ట్ర ఉపాధ్యక్షులు కేశి పెద్ది రామారాజు,మంచిర్యాల జిల్లా అధ్యక్షులు సుదర్శన్ రాజు,యువజన సంఘం సభ్యులు, యువత తదితరులు పాల్గొన్నారు.

Related posts

ఘనంగా ప్రపంచ మలేరియా దినోత్సవం: దోమల నియంత్రణపై కలెక్టర్ దృష్టి

Chief Editor: Satish Kumar

*తల్లిపాల ప్రాముఖ్యతపై విస్తృత అవగాహన కల్పించాలి: డి ఎం హెచ్ ఓ డాక్టర్.నరేందర్ రాథోడ్*

*గ్రీవెన్స్ డేలో ప్రజల వినతుల స్వీకరణ.. చట్టపరంగా త్వరిత పరిష్కారానికి సీపీ ఆదేశాలు*

Share this