September 10, 2026
Praja Telangana
తెలంగాణ

*రాహుల్ గాంధీ అరెస్టును ఖండిస్తూ మంచిర్యాలలో కాంగ్రెస్ నిరసన*

మంచిర్యాల, జూలై 22: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అరెస్టును ఖండిస్తూ మంచిర్యాల గాంధీ పార్క్‌లోని మహాత్మా గాంధీ విగ్రహం వద్ద కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం ఏఐసీసీ, పీసీసీ, మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్‌సాగర్‌రావు, జిల్లా కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ సూచనల మేరకు చేపట్టారు.ఈ సందర్భంగా కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తూముల నరేష్, మేయర్ మాట్లాడుతూ ఢిల్లీలో నీట్ పరీక్షా పత్రాల లీకేజీ వ్యవహారంపై విద్యార్థులు చేపట్టిన నిరసనకు మద్దతు తెలిపిన రాహుల్ గాంధీని కేంద్ర ప్రభుత్వం అక్రమంగా అరెస్టు చేయడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని విమర్శించారు. విద్యార్థులపై లాఠీచార్జి చేయడం, ప్రజా సమస్యలపై ప్రశ్నించే ప్రతిపక్ష నాయకుల గొంతు నొక్కే ప్రయత్నాలు చేయడం ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని పేర్కొన్నారు.రైతులు, యువత, నిరుద్యోగులు, మహిళల సమస్యలపై పోరాడుతున్న రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలపై తీసుకున్న చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. నీట్ పేపర్ లీకేజీ ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్య విలువలు, రాజ్యాంగ పరిరక్షణ కోసం కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన పోరాటం కొనసాగిస్తుందని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, మహిళా నాయకులు, యువజన కాంగ్రెస్ ప్రతినిధులు పాల్గొన్నారు.

Related posts

*పర్యావరణహితంగా రాష్ట్ర గ్రీన్ కోర్ డైరెక్టర్ డా. డబ్ల్యూ.జి. ప్రసన్నకుమార్ ఉద్యోగ విరమణోత్సవం ఘనంగా నిర్వహణ*

శ్రీరామనవమి సందర్భంగా హనుమాన్ మాల ధారణతో హోమం నిర్వహణ

*యంగ్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎక్సలెన్స్–2026 ప్రవేశ పరీక్షలను పారదర్శకంగా నిర్వహించాలి: జిల్లా అదనపు కలెక్టర్ పి.చంద్రయ్య*

Share this