July 28, 2026
Praja Telangana
తెలంగాణ

*ఇందారం ఎక్స్‌రోడ్డు వద్ద హెచ్చరిక బోర్డు ఏర్పాటు… రోడ్డు ప్రమాదాల నివారణకు జైపూర్ పోలీసుల చర్యలు*

జైపూర్,జూలై 10:రోడ్డు ప్రమాదాల నివారణకు రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని మంచిర్యాల జోన్ జైపూర్ పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఇందారం ఎక్స్‌రోడ్డు వద్ద ఎస్‌ఐ భూమేష్ ఆధ్వర్యంలో హెచ్చరిక బోర్డును ఏర్పాటు చేసి వాహనదారులు, వ్యాపారులకు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా ఎస్‌ఐ భూమేష్ మాట్లాడుతూ ప్రధాన రహదారిపై వాహనాలను నిలిపివేయడం, టిఫిన్ బండ్లు, ఇతర వ్యాపార కార్యకలాపాలు నిర్వహించడం వల్ల ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడి రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుందని తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రజలను అప్రమత్తం చేసేందుకు ఇందారం ఎక్స్‌రోడ్డు వద్ద హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.రహదారులపై టిఫిన్ బండ్లు లేదా ఇతర వ్యాపారాలు నిర్వహించకుండా సహకరించాలని, వాహనదారులు రహదారిపై వాహనాలను నిలిపివేయకుండా ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు. ప్రజల ప్రాణ భద్రతే పోలీసు శాఖ ప్రధాన లక్ష్యమని పేర్కొన్న ఆయన, నిబంధనలు ఉల్లంఘించే వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.

Related posts

*యోగా సాధనతో సంపూర్ణ ఆరోగ్యం సాధ్యం.. ఆరోగ్యకరమైన జీవనశైలికి యోగా ఎంతో అవసరం : మేయర్ ధరణి మధుకర్*

నెన్నెల్ లో కత్తిపోటు నిందితుడు అరెస్ట్

*యంగ్ ఇండియా ప్రవేశ పరీక్షలు పారదర్శకంగా నిర్వహించాలి: అదనపు కలెక్టర్ పి. చంద్రయ్య*

Share this