మంచిర్యాల,జూన్19:ప్రపంచ సికిల్ సెల్ దినోత్సవం సందర్భంగా కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల వైద్య ఆరోగ్యశాఖ ఆదేశాల మేరకు సికిల్ సెల్ వంశపారంపర్య పరీక్షలు,వ్యాధి నివారణపై అవగాహన కల్పించేందుకు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో అవగాహన ర్యాలీ,కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమాన్ని ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ సుధాకర్ నాయక్ ప్రారంభించారు.ఈ సందర్భంగా డాక్టర్ సుధాకర్ నాయక్ మాట్లాడుతూ సికిల్ సెల్ వ్యాధిని ముందస్తుగా గుర్తించేందుకు వంశపారంపర్య పరీక్షలు ఎంతో ముఖ్యమని, ప్రతి ఒక్కరూ పరీక్షలు చేయించుకొని వ్యాధిపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు.ప్రజలకు సికిల్ సెల్ వ్యాధి లక్షణాలు, నివారణ చర్యలపై విస్తృతంగా అవగాహన కల్పించాలని వైద్య సిబ్బందికి సూచించారు.అదేవిధంగా జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో కూడా సికిల్ సెల్ వ్యాధిపై ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించి,వంశపారంపర్య పరీక్షల ప్రాధాన్యతను వివరించడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి ఆర్ఎంఓ డాక్టర్ శ్రీధర్,వైద్యాధికారులు,వైద్య సిబ్బంది, విద్యార్థులు,సికిల్ సెల్ థలసీమియా జిల్లా కార్యవర్గ సభ్యులు కాసర్ల శ్రీనివాస్,చుంచు శంకర్ వర్మ,అవినాష్,కంకణాల భాస్కర్ రెడ్డి,జిల్లా వైద్య ఆరోగ్యశాఖ మాస్ మీడియా అధికారి బుక్క వెంకటేశ్వర్,అల్లాడి శ్రీనివాస్,శ్రీనామదేవ్,కాకినాడ వెంకటేశ్వర్లు,శ్రీనివాస్,పుట్ట సత్తయ్య,వైద్యులు తదితరులు పాల్గొన్నారు.

