మంచిర్యాల,జూన్8:సంక్షేమ పథకాల అమలు,పారిశుధ్యం,ఓటరు జాబితా సవరణపై అవగాహన కల్పించిన జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 31,32 డివిజన్లకు సంబంధించి సోమవారం నిర్వహించిన డివిజన్ సభలో జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ పాల్గొన్నారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా నిర్వహిస్తున్న గ్రామ, డివిజన్, వార్డు సభల ద్వారా ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాల అమలు మరియు ప్రజా సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.ఈ సందర్భంగా పారిశుధ్యం, ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ, అరైవ్-అలైవ్ కార్యక్రమం, ఇందిరమ్మ ఇండ్లు, విద్య, ఆరోగ్యం, మహిళల భద్రత తదితర అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ప్రజలు ట్రాఫిక్ నియమాలు పాటించాలని, హెల్మెట్, సీట్ బెల్ట్ తప్పనిసరిగా ధరించాలని సూచించారు.అనంతరం జిల్లా కలెక్టర్ లబ్ధిదారులకు తొలి విడత ఇందిరమ్మ ఇళ్ల ప్రొసీడింగ్స్ అందజేశారు. కార్యక్రమంలో డీసీపీ ఎ.భాస్కర్, అదనపు కలెక్టర్ పి.చంద్రయ్య, మేయర్ ధర్ని మధుకర్, కమిషనర్ అన్వేష్, కార్పొరేటర్ సంపత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

