September 12, 2026
Praja Telangana
తెలంగాణ

*మహిళల భద్రతకు షీ టీమ్ అండ___ పెద్దంపేట గ్రామ సభలో అవగాహన సదస్సు…. వేధింపులపై ధైర్యంగా ఫిర్యాదు చేయాలని సూచన: షి టీం ఎస్ఐ ఉషారాణి*

హాజీపూర్,జూన్ 8:హాజీపూర్ మండలం పెద్దంపేట గ్రామంలో ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక (99 రోజుల కార్యక్రమం)లో భాగంగా మహిళల భద్రత, రక్షణపై షీ టీమ్ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా ఆదేశాల మేరకు సోమవారం జరిగిన ఈ కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా షీ టీమ్ ఎస్‌ఐ ఉషారాణి మహిళలకు అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, కుటుంబం,కార్యాలయాలు, సామాజిక మాధ్యమాలు తదితర ప్రాంతాల్లో మహిళలు ఎదుర్కొంటున్న వేధింపులపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. బస్‌స్టాప్‌లు,రైల్వే స్టేషన్లు, కాలనీలు, బహిరంగ ప్రదేశాల్లో ఎవరైనా అసభ్యంగా ప్రవర్తించినా, వెంబడించినా లేదా బెదిరింపులకు పాల్పడినా వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు.మహిళల భద్రత, సమస్యల పరిష్కారం కోసం షీ టీమ్స్ నిరంతరం అందుబాటులో ఉంటాయని పేర్కొంటూ,అత్యవసర పరిస్థితుల్లో రామగుండం షీ టీమ్ వాట్సాప్ నంబర్ 6303923700,మంచిర్యాల షీ టీమ్ నంబర్ 8712659385 లేదా డయల్-100కు ఫిర్యాదు చేయాలని సూచించారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ జాడి వెంకటేష్, వ్యవసాయ విస్తరణ అధికారి కొమురయ్య,పంచాయతీ కార్యదర్శి రూపాదేవి,షీ టీమ్ సిబ్బంది సతీష్, జ్యోతి తదితరులు పాల్గొన్నారు.

Related posts

నిరుపేద గర్భిణిని కాపాడిన బర్త్ రూట్స్ హాస్పిటల్

వడదెబ్బ నివారణ,పొగాకు దుష్ప్రభావాలపై ప్రజల్లో అవగాహన సదస్సు:జిల్లా మాస్ మీడియా అధికారి బుక్క వెంకటేశ్వర్

గంజాయి రవాణాపై కఠిన చర్యలు తప్పవు: సీఐ ప్రమోద్ రావు

Chief Editor: Satish Kumar
Share this