June 3, 2026
Praja Telangana
తెలంగాణ

గంజాయి రవాణాపై కఠిన చర్యలు తప్పవు: సీఐ ప్రమోద్ రావు

మంచిర్యాల,మే18:గంజాయి అక్రమ రవాణా, నిల్వ, వినియోగంపై కఠిన చర్యలు తీసుకుంటామని మంచిర్యాల సీఐ ప్రమోద్ రావు హెచ్చరించారు.రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా, డీసీపీ ఏ. భాస్కర్ ఆదేశాల మేరకు, ఏసీపీ ఆర్. ప్రకాష్ పర్యవేక్షణలో సోమవారం మంచిర్యాల రైల్వే స్టేషన్, బస్ స్టాండ్, పాన్ షాపులు, సినిమా థియేటర్లలో నార్కోటిక్ స్నిఫర్ డాగ్ సహాయంతో విస్తృత తనిఖీలు నిర్వహించారు.బస్సులు,రైళ్లు, ప్రయాణికుల బ్యాగులు,అనుమానాస్పద పార్సిళ్లను పరిశీలించి వివరాలు సేకరించారు.మహారాష్ట్ర నుంచి వచ్చే ప్రయాణికులపై ప్రత్యేక నిఘా పెట్టినట్లు తెలిపారు.యువత జీవితాలను నాశనం చేసే గంజాయి రవాణా,విక్రయాలపై ప్రత్యేక దృష్టి పెట్టామని పేర్కొన్నారు.ఈ తనిఖీల్లో ఎస్‌ఐ ఆది మధుసూదన్,డాగ్ స్క్వాడ్,నార్కోటిక్ టీమ్, పోలీస్ స్పెషల్ పార్టీ సిబ్బంది పాల్గొన్నారు.

Related posts

రాష్ట్ర ప్రభుత్వం సంచార కులాలకు కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి

ఫిల్టర్ బెడ్ ఏరియా మందమరిలో గుడుంబా పట్టివేత

Share this