June 13, 2026
Praja Telangana
తెలంగాణ

రైతులకు మేయర్ సూచనలు — సన్న వడ్ల సాగుకు ప్రాధాన్యం

మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 09వ డివిజన్ సీతారాంపల్లి క్లస్టర్‌లో జిల్లా వ్యవసాయ శాఖ, ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన సమీక్ష సమావేశానికి మేయర్ దర్ని మధుకర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన మేయర్ అధికారులు, రైతులతో మాట్లాడి పలు సూచనలు చేశారు. రానున్న వేసంగిలో రైతులు సన్న వడ్ల సాగుకు ప్రాధాన్యం ఇవ్వాలని, ప్రభుత్వం సన్న వడ్ల కొనుగోలుకు ప్రత్యేక ప్రోత్సాహం అందిస్తున్నట్లు తెలిపారు.ఈ సమావేశంలో రైతులకు సాగులో తీసుకోవాల్సిన జాగ్రత్తలు,ఎరువుల వినియోగం,పురుగుల నివారణపై అవగాహన కల్పించారు. ఉద్యానవన పంటలపై లభించే రాయితీల వివరాలను కూడా వివరించారు.ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ సురిమిల్ల సౌమ్య వేణు, వ్యవసాయ అధికారులు, ఉద్యానవన శాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు, రైతులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

Related posts

జూలై 9 దేశవ్యాప్త సమ్మెకు జే ఏ సి పిలుపు

Chief Editor: Satish Kumar

వైద్యులు సూచించిన విధంగా మాత్రమే మందులు విక్రయించాలి

ఆర్టీసీ కార్మికుడు శంకర్ గౌడ్ కుటుంబానికి కేటీఆర్ పరామర్శ.. రూ.5 లక్షల ఆర్థిక సాయం

Share this